వయసుతో సంబంధం లేకుండా జీవనశైలి వల్ల చాలామంది చిన్నవయసులోనే మధుమేహానికి గురవుతున్నారు. అయితే ఇది సంతానలేమికి కారణమవుతుంది అంటున్నారు భారతీయ నిపుణులు. ముఖ్యంగా మధుమేహం పురుషుల్లో శుక్రకణాల డీఎన్‌ఏని దెబ్బతీయడంతో వాటిల్లో కదలిక తగ్గుతుందట. అలాగని మధుమేహం పూర్తిగా సంతానరాహిత్యానికి దారితీస్తుందని చెప్పలేం. కానీ సంతాన అవకాశాల్ని తగ్గిస్తుంది అంటున్నారు. అలాగే ఈ మధుమేహం మహిళల్లో పాలీ సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌కీ ఇతరత్రా ఆటో ఇమ్యూన్ వ్యాధులకీ కారణమవుతుంది. ఇవన్నీ కలిసి సంతాన సాఫల్యత శాతాన్ని తగ్గిస్తాయి. అంటే మధుమేహంతో బాధపడే మహిళల్లో గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని హెచ్చరిస్తున్నారు.
సంతానలేమికి మధుమేహం కారణం
Related tags :