Food

పనస తొనలు బాగా తినాలి

Jack Fruit Must Be Taken In Good Quantities

తీయగా, ఎక్కువ పీచుతో ఉండే పనస పండును ఇష్టంగా తింటాం. క్యాలరీలతో నిండిన ఈ పండులో కొలెస్ట్రాల్‌ అస్సలుండదు. ఆరోగ్యానికి, అందానికి మేలు చేసే గుణాలు పనసలో ఎక్కువ. ఈ పండుతో కలిగే ఇతర ***ప్రయోజనాలేమంటే..పనస పండులో ఎ, సి, ఈ, కె, బి6, నియాసిన్‌ విటమిన్లతో పాటు రక్తం తయారీకి అవసరమైన కాపర్‌, మాంగనీస్‌, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు ఉంటాయి. ఇవి రక్తహీనత ముప్పును అడ్డుకుంటాయి.పనస గింజల్లో ప్రొటీన్లు మెండు. అందుకే వీటిని పలురకాల వంటకాల్లో రుచికోసం వాడతారు. పప్పు ధాన్యాలలో లభించే పోషకాల్లో దాదాపు ఈ గింజల్లో లభిస్తాయి.తల భాగంలో రక్తప్రసరణ సవ్యంగా జరిగేందుకు పనస పండు తోడ్పడుతుంది. ఫలితంగా శిరోజాలు ఏపుగా పెరుగుతాయి.వీటి గింజల్లోని విటమిన్‌ ఎ కంటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు పొడిజుట్టు, వెంట్రుకలు కొస భాగంలో చిట్లిపోవడం వంటి సమస్యలను నివారించి, శిరోజాలను సంరక్షిస్తుంది.పనస పండులోని సి విటమిన్‌ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూను అడ్డుకుంటుంది..తక్కువ క్యాలరీలు ఉన్నప్పటికీ, ఫ్రక్టోజ్‌, సుక్రోజ్‌ చక్కెరలు శరీరానికి వెంటనే శక్తినందిస్తాయి. ఈ పండులో కొలెస్ట్రాల్‌ ఉండదు. అందుకే దీన్ని ‘హెల్తీఫుడ్‌’గా తీసుకోవచ్చు.పనస గింజల్ని నిమిషం పాటు పాలలో నానబెట్టాలి. వీటిని పొడి చేసుకొని చర్మ ముడతల మీద రాసుకోవాలి. ఇలా 6 వారాలు అప్లై చేస్తే ముడతలు తగ్గి, అందంగా కనిపిస్తారు.ఎండిన పనస గింజల్ని పాలు, తేనెలో నానబెట్టి, మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాదనంతో వెలిగిపోతుంది.ుఽ వీటి గింజల్ని నేరుగా తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య తగ్గిపోతుంది. ఈ గింజల్లోని పీచుపదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫ్లేవనాయిడ్స్‌, ఫైటో న్యూట్రియెంట్స్‌ ఫ్రీరాడికల్స్‌ బయటకు పంపిస్తాయి. దాంతో కేన్సర్‌ వ్యాధి నుంచి రక్షణనిస్తాయి.వీటి గింజల్లోని పొటాషియం, రక్తంలోని సోడియం నిల్వల్ని నియంత్రిస్తుంది. అధిక, అల్ప రక్తపీడనం, గుండెపోటు వచ్చే ముప్పును నివారిస్తుంది.పనసలోని కొవ్వులు పెద్దపేగులోని విషపదార్థాలను తొలగిస్తాయి. పెద్దపేగు కేన్సర్‌ నుంచి కాపాడుతాయి.ఎముకల దృఢత్వానికి అవసరమైన కాల్షియం వీటిల్లో లభిస్తుంది. ఆస్టియోపోరోసిస్‌ ముప్పును తగ్గిస్తుంది. అస్తమాతో బాధపడేవారు పనసపండు తింటే ప్రయోజనం ఉంటుంది. థైరాయిడ్‌ గ్రంథి పనితీరుకు అవసరమైన కాపర్‌ పనసలో లభిస్తుందిదీనిలోని విటమిన్‌ బి6, రక్తంలో హోమోసిస్టిన్‌ అమినో ఆమ్లం నిల్వల్ని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పనసలోని కెరోటినాయిడ్స్‌ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, టైప్‌ 2 డయాబెటీస్‌, గుండె జబ్బుల్ని నివారిస్తుంది.