రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజల ఆస్తులు కొట్టేయడానికి ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికలు వేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. చుక్కల భూములు, అసైన్డ్ భూములు, సొసైటీ భూములు… ఇలా ఆరు రకాల భూములపై జగన్ కన్ను పడిందని ఆయన పేర్కొన్నారు. అందుకే భూముల సర్వే అంటూ ఇప్పుడు హడావుడి చేస్తున్నారన్నారు. పార్టీ సీనియర్ నాయకులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో చంద్రబాబు మంగళవారం వీడియో సమావేశం నిర్వహించారు. ‘భూసర్వేతో రాష్ట్రంలోని ప్రజలంతా తమ ఆస్తుల్ని, భూముల్ని ఏ రోజుకారోజు సరి చూసుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. జగన్ అండతో రాష్ట్రవ్యాప్తంగా వైకాపా ల్యాండ్ మాఫియా పేట్రేగుతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా వందల కోట్ల రూపాయల భూకుంభకోణాలకు పాల్పడ్డారు. వైకాపా నేతలు, వారి కార్యకర్తల ఆస్తులకే రక్షణ లేదనటానికి గుంటూరు జిల్లా భట్టిప్రోలులో వైకాపా కార్యకర్త ఆత్మహత్య సంఘటనే ఉదాహరణ’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
భూముల్లో ఆరు రకాలు ఉంటాయి…
Related tags :