* ధర్మవరంలో దారుణం.. యువతిని చంపి పెట్రోల్ పోసి.! అమానుషం.పొలాల్లో యువతి మృతదేహం లభ్యమైంది. కిరాతకంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టడంతో పాక్షికంగా కాలిపోయింది. ఈ ఘటన అనంతపురంలో తీవ్ర కలకలం రేపుతోంది.అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం జరిగింది. యువతిని కిరాతకంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన అమానుష ఘటన వెలుగుచూసింది. అనంతపురం ఎస్బీఐలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న స్నేహలత దారుణ హత్యకు గురైంది. ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద పొలాల్లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమెను కిరాతకంగా హత్య చేసిన దుండగులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో పాక్షికంగా తగలబడింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. సంఘటన స్థలంలో దొరికిన ఐడీ కార్డు ఆధారంగా ఆమెను స్నేహలతగా గుర్తించారు. ప్రియుడే ఆమెను కిరాతకంగా హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఆమె నిత్యం ధర్మవరం నుంచి అనంతపురం వచ్చి వెళ్తుండేదని తెలుస్తోంది.రాజేష్, కార్తీక్ అనే యువకులే తమ కూతురిని హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. యువతిని చంపేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
* ఇంటర్నెట్ ద్వారా నిర్వహించే ఆన్లైన్ యాప్ ల పై జిల్లా ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని, చట్టబద్ధత లేని యాప్ లతో రుణాలు తీసుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయని గద్వాల్ జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ అన్నారు.
* బ్రిటన్, ఫ్రాన్స్ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నది.కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ తన సరిహద్దులను మూసివేసింది.దీంతో ఆ ప్రాంతంలో వేలాది సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.అయితే యూకేతో ఉన్న బోర్డర్లను ఫ్రాన్స్ రీఓపెన్ చేసింది.ఫ్రాన్స్‌లో జీవిస్తున్న బ్రిటీషర్లు ట్రావెల్ చేసేందుకు అనుమతిస్తున్నారు.అయితే ఇంకా ట్రక్కు డ్రైవర్లకు అనుమతి దక్కడం లేదు.డోవర్ ప్రాంతంలో వేల సంఖ్యలో ట్రక్కులు నిలిచిపోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులతో డ్రైవర్లు ఘర్షణకు దిగారు.వేచి ఉన్న ట్రక్కు డ్రైవర్లకు తాజాగా కరోనా పరీక్షలు చేపడుతున్నారు. వారందరికీ ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
* తెలంగాణలోకి మావోయిస్టులు ప్రవేశించాలని చూస్తే వారి చర్యలను తిప్పికొడతామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
* చిత్తూరు జిల్లా పీలేరు మండలం…ఆర్టీసీ అద్దె బస్సు ఆటో ఢీకొని వ్యక్తి మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయాల పాలైన సంఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది.స్థానికుల కథనం మేరకు మండల కేంద్రం లోని పీలేరు తిరుపతి రోడ్డు మార్గంలో సందీప్ హాస్పిటల్ సమీపంలో తిరుపతి నుంచి పీలేరుకు వస్తున్న ఆర్టీసీ అద్దె బస్సు సందీప్ హాస్పిటల్ సమీపంలోకి రాగానే బ్రేక్ సెడన్ గా వేయడంతో ఆ వెనుకనే బాకరాపేట నుంచి పీలేరు కు ప్రయాణికులతో వస్తున్న ఆటో వెనుక వైపు నుంచి బస్సు ను ఢీకొని బోల్తా పడింది. ఆటోలోని చిన్నగొటిగళ్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ భూతంవారిపల్లికి చెందిన రెడ్డప్ప (65)అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన చిన్న గొట్టిఘల్లు మండలం కోటబైలు కి చెందిన అస్మత్ బి (34), బల్కిస్ భాను (26), బాకరాపేట సందు వీధికి చెందిన ఆటో డ్రైవర్ సుబ్రమణ్యం (26), పులిచెర్ల మండలానికి చెందిన పూజిత (20)లు తీవ్రంగా గాయపడ్డారు.తీవ్రంగా గాయపడ్డ నలుగురిని పీలేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అనంతరం విషమంగా ఉండటంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.