ఒంటికి చల్లదనంతో పాటు చర్మసంరక్షణను అందించే కీరదోసలో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు చాలానే ఉన్నాయి. వేసవి కాలంలో కీరదోసతో ఉపశమనం పొందడమే కాదు ఆరోగ్యాన్నీ కాపాడుకోవచ్చు.కీరతో ఒనగూరే ఆరోగ్య లాభాలేంటో తెలుసుకుందాం…కీరదోసలో తొంభై శాతంపైగా నీరు ఉంటుంది. వేడి వల్ల శరీరం కోల్పోయిన నీటిని, ఎలక్ర్టోలైట్స్‌ను కీరదోస భర్తీచేస్తుంది. కీరదోస తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా, తాజాగా కనిపిస్తుంది.ఎండ ప్రభావం వల్ల చర్మం కందిపోతుంది. కీరదోస ముక్కలతో చర్మం మీద రుద్దుకుంటే సాంత్వన లభిస్తుంది. టాన్ సమస్య నుంచి చర్మాన్ని కాపాడుతుంది. కీరదోస తినడం వల్ల శరీరంలో నీటి పరిమాణం పెరుగుతుంది. దాంతో ఒంట్లోని మలినాలు, విషపదార్థాలు బయటకు పోతాయి. యూరిక్ ఆమ్లం నిల్వలు తగ్గిపోతాయి. కిడ్నీలో ఏర్పడిన రాళ్లు కూడా కరిగిపోతాయి. దీనిలో ఎ, బి, సి విటమిన్లు లభిస్తాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తాయి. కీరదోస రసాన్ని బచ్చలి, క్యారెట్ రసంతో కలిపి కూడా తీసుకోవచ్చు. తరచుగా కీర తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది. కీరలో లభించే విటమిన్ ఇ చర్మం ముడతల్ని నివారించి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.కీరదోస ముక్కలు ఉంచిన నీళ్లను రోజు తాగితే శరీర పీహెచ్ ఒకేవిధంగా ఉంటుంది.చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడే మెగ్నీషియం, పొటాషియం, సిలికాన్ వంటి మినరల్స్ కీరదోసలో ఉంటాయి. చల్లచల్లని కీర ముక్కలను కళ్ల మీద కొద్దిసేపు ఉంచితే కళ్ల కింద ఏర్పడే వలయాలు తగ్గిపోతాయి. కళ్ల అలసట కూడా పోతుంది.వీటిని సలాడ్స్ లేదా సూప్ రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి నీటితో పాటు పీచుపదార్థం కూడా అధికంగా అందుతుంది. దాంతో తొందరగా ఆకలి వేయదు. అహారం తక్కువగా తింటారు. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.కీరదోస రసం తాగితే చిగుళ్ల గాయాలు తగ్గిపోతాయి. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. కీరదోసంలో లభించే సిలికా మూలకం కేశాలను, గోళ్లను దృఢంగా మార్చి, వాటిని మెరిసేలా చేస్తుంది.కీరదోసను తరచుగా తినడం ద్వారా అధిక రక్తపీడనం, అల్ప రక్తపీడనం వంటి సమస్యలు తగ్గిపోతాయి. దీనిలోని స్టెరాయిడ్స్ చెడు కొలెసా్ట్రల్‌ను తగ్గిస్తాయి. దాంతో గుండె సంబంధమైన జబ్బుల నుంచి కాపాడుతుంది.వీటిని తినడం వల్ల క్లోమ గ్రంథిలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి డయాబెటిక్ సమస్య ఉన్నవారికి కీరదోస మంచి ఫడ్ చాయిస్. కీరలోని విటమిన్లు, మినరల్స్ కండరాలు, కీళ్ల నొప్పులను నివారిస్తాయి.దీనిలో విటమిన్ కె లభిస్తుంది. క్యాల్షియాన్ని ఎముకలకు అందించి, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ కె సాయపడుతుంది.
కీరదోస…నమలేయండి కస పిస
Related tags :