దేశంలోని ఏడు టాప్ సిటీలలో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది (జనవరి–టు డిసెంబర్)లో 47 శాతం తగ్గుతాయని ప్రోపర్టీ కన్సల్టెంట్ అనరాక్ అంచనా వేస్తోంది.ఈ అమ్మకాలు 1.38 లక్షలకు పరిమితమవుతాయని చెబుతోంది. కోవిడ్ 19తో డిమాండ్ తగ్గడమే దీనికి కారణమని పేర్కొంది. కొత్త హౌసింగ్ సప్లయ్ కూడా 46 శాతం తగ్గి 1.28 లక్షల యూనిట్లకుగా నమోదవుతుందని అంచనా వేస్తోంది. ఢిల్లీ (ఎన్సీఆర్), ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), పుణె, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కత్తాలలో హౌసింగ్ సేల్స్‌పై కంపెనీ రిపోర్డు విడుదల చేసింది.2020 సంవత్సరం ముగియడానికి పది రోజుల ముందే ఈ డేటాను కంపెనీ ప్రకటించింది. 2019లో 2.61 లక్షల ఇళ్లు అమ్ముడవగా, కొత్త ఇళ్ల సప్లయ్ 2.37 లక్షలుగా రికార్డయినట్లు అనరాక్ పేర్కొంది. 2020లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ బాటమ్ అవుట్ అయిందని, అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో మంచి రికవరీ కనబడుతోందని తెలిపింది. కోవిడ్ 19 కారణంగా 2020లో రియల్ ఎస్టేట్ రంగంలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. అప్పటికే ఉన్న కష్టాలు రెట్టింపయ్యాయి. అయితే చివరి రెండు క్వార్టర్లలోనూ రెసిడెన్షియల్ డిమాండ్ కొంత ఊపందుకుందని అనరాక్ ఛైర్మన్ అనుజ్ పురి చెప్పారు. పెంటప్ డిమాండ్‌కు డిస్కౌంట్లు, ఆఫర్లు తోడవడంతో రెసిడెన్షియల్ హౌసింగ్ సేల్స్ జోరు మీదున్నాయని అభిప్రాయపడ్డారు. హౌసింగ్ లోన్స్‌పై తక్కువ వడ్డీ రేటు, స్టాంప్ డ్యూటీ కోత వంటివీ డిమాండ్ పెరగడంలో సాయపడ్డాయని పేర్కొన్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో గరిష్టంగా 44,320, బెంగళూరులో 24,910 ఇళ్లు అమ్ముడవుతాయని డేటా చెబుతోంది. 2019లో ముంబైలో 80,870 ఇళ్లు సేల్ అయ్యాయి. దీంతో పోలిస్తే 2020లో సేల్స్ 45 శాతం తక్కువ. బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు అంతకు ముందు ఏడాదిలోని 50,450 నుంచి 51 శాతం తగ్గుతాయని అనరాక్ పేర్కొంది. పుణెలో అమ్మకాలు 42 శాతం, ఢిల్లీ (ఎన్సీఆర్)లో 51 శాతం సేల్స్ పడనున్నాయని తెలిపింది. హైదరాబాద్‌లో 2019లో 16,590 ఇళ్లు అమ్ముడయ్యాయి. దీంతో పోలిస్తే 2020లో సేల్స్ 48 శాతం తగ్గి 8,560 కి పరిమితమవుతున్నట్లు రిపోర్టు వెల్లడించింది. చెన్నైలో ఇళ్ల అమ్మకాలు 6,740 యూనిట్లకు తగ్గుతాయని పేర్కొంది. కోల్‌కత్తాలో సేల్స్ తగ్గుదల 49 శాతమని వెల్లడించింది. అమ్ముడుకాని హౌసింగ్ స్టాక్ ఈ ఏడాది 2 శాతం తగ్గి 6,38,020 యూనిట్లకు చేరుతుందని, అంతకు ముందు ఏడాదిలో ఇది 6,48,400 యూనిట్లని అనరాక్ రిపోర్టు తెలిపింది. రియల్టర్ల అపెక్స్ అసోసియేషన్లయిన క్రెడాయ్, నారెడ్కోలు కొత్త సప్లయ్, సేల్స్ డేటాలను కంపైల్ చేయడం లేదు. వీటిలో 25 వేల మంది డెవలపర్లు మెంబర్లుగా ఉన్నారు. కొంత మంది ప్రోపర్టీ కన్సల్టెంట్లు, డేటా ఎనలిటిక్స్ ఫర్మ్స్ క్వార్టర్లీ ప్రాతిపదికన హౌసింగ్ మార్కెట్ డేటాను రూపొందిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో లిస్టయిన రియల్ ఎస్టేట్ కంపెనీలు మాత్రం తమ క్వార్టర్లీ సేల్స్ బుకింగ్స్, లాంఛ్ వివరాలను వెల్లడిస్తాయి.
హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు ఢమాల్!
Related tags :