మళ్ళీ రంజీలో ఆడాలి

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంఎస్‌ ధోనీని ఎంపిక చేయకపోవడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ అన్నాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన చేయాలంటే అతడు ఝార్ఖండ్‌ రంజీ జట్టు తరఫున ఆడాలని సూచించాడు. అప్పుడే ఫామ్‌ కొనసాగించొచ్చని దాదా పేర్కొన్నాడు. ‘టీ20 జట్టు నుంచి ధోనీని తప్పించడం నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే అతడి ప్రదర్శన ఆశాజనకంగా లేదు. 2020 టీ20 ప్రపంచకప్‌ వరకు మహీ కొనసాగుతాడన్న నమ్మకమూ లేదు. అందుకే సెలక్టర్లు మంచి ఫామ్‌లో ఉన్న రిషబ్‌ పంత్‌కు అవకాశం ఇచ్చారు. అయితే సెలక్టర్లు ధోనీని వన్డే ప్రపంచకప్‌ ఆడించాలనుకుంటే మాత్రం చాలినన్ని అవకాశాలు ఇవ్వాలి. వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌ తర్వాత మహీ దేశవాళీ మ్యాచ్‌లు ఎక్కువ ఆడేలా కనిపించడం లేదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌లను నేరుగానే ఆడతాడు. నిరంతర సాధన లేకుండా ఇంత అంతరంతో వన్డేలు ఆడటం చాలా కష్టం’ అని దాదా వెల్లడించాడు. ధోనీని జట్టు నుంచి తొలగించడంతో అతడి అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో 2020 టీ20 ప్రపంచకప్‌నకు రెండో వికెట్‌ కీపర్‌ను సిద్ధం చేసేందుకే ఎంఎస్‌ ధోనీకి విశ్రాంతి కల్పించామని సెలక్టర్లు మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com