పొద్దు తిరుగుడు విత్తనాలు మంచివే!

సాధారణంగా మనలో అధిక శాతం మంది పొద్దు తిరుగుడు విత్తనాలతో తయారు చేసిన నూనె (సన్ ఫ్లవర్ ఆయిల్)ను వంటల్లో వాడుతుంటారు. ఈ ఆయిల్ వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే కేవలం ఆయిల్ మాత్రమే కాదు.. పొద్దు తిరుగుడు విత్తనాలు, ఆకులు, వేర్లు కూడా మనకు ఉపయోగకరమే. వాటితో ఏయే అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఊపిరి తిత్తుల వ్యాధులతో బాధపడేవారికి పొద్దు తిరుగుడు విత్తనాలతో చేసిన కషాయం అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. పొద్దు తిరుగుడు.. చేదు, వగరు, కారం రుచులతో వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. శరీరంలోని కఫ, పిత్త రోగాలను, శ్వాసరోగాలను, జ్వరాలను, చర్మరోగాలను, ప్రమేహాలను రక్తదోషాలను హరిస్తుంది.. జీర్ణశక్తి లోపించిన వారు పొద్దు తిరుగుడు గింజల నూనెను ప్రతిరోజూ తగినంత మోతాదులో సేవిస్తే జీర్ణశక్తి అభివృద్ధి చెందుతుంది. పొద్దు తిరుగుడు చెట్టు ఆకులను నీడలలో ఎండించి చూర్ణం చేసి ఒక కప్పు పెరుగులో అర చెంచా పొడిని వేసి దాంట్లో అర కప్పు దానిమ్మ పండు రసం కలిపి చారు కాచినట్లు వేడి చేసి దించి రెండు మూడు చెంచాల నెయ్యి చేర్చి రెండు పూటలా తాగుతుంటే కడుపు నొప్పితో కూడిన వేదించే విరేచనాలు త్వరగా తగ్గిపోతాయి. పొద్దు తిరుగుడు చెట్టు ఆకులు, బొప్పాయి చెట్టు ఆకులు రెండింటిని కలిపి ఆకుకూరలాగా వండి రెండు పూటలా తింటుంటే శరీరంలో అధికమైన చెడు నీరు పోయి ఉబ్బురోగం హరించుకుపోతుంది. పొద్దు తిరుగుడు చెట్టు వేరు బియ్యం కడిగిన నీటితో నూరి గంధం లాగా అరగదీసి ఆ గంధం ఒక టీస్పూను మోతాదుగా ఒక ఒక కప్పు బియ్యం కడిగిన నీటిలో కలిపి రెండు పూటలా సేవిస్తుంటే స్త్రీలకు వచ్చే రుతు సమస్యలు నివారణ అవుతాయి.తేలు కుట్టిన వెంటనే పొద్దు తిరుగుడు చెట్టు ఆకును మెత్తగా నూరి రెండు ముక్కులతో బాగా వాసన చూడాలి. వాసన చూసిన తర్వాత మరుక్షణమే తేలు విషం నశించిపోయి నొప్పి, బాధ మంట వెంటనే తగ్గిపోతాయి. పొద్దు తిరుగుడు చెట్టు ఆకులను సమూలంగా మెత్తగా దంచి ఆ ముద్దను రాత్రి నిదురించే ముందు కాలి పగుళ్లపైన పట్టిస్తుంటే పగుళ్లు, పుండ్లు పూర్తిగా తగ్గిపోయి పాదాలు ప్రకాశవంతంగా, ఆరోగ్యవంతంగా తయారవుతాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com