NRI-NRT

టెక్సాస్‌లో మెదడు తినే అమీబా

Texan 6Yr old Dead Due To Brain Eating Amoeba

కరోనా మహమ్మారి వేషాలు మార్చుకుంటూ ప్రపంచంపై దండయాత్ర సాగిస్తున్న తరుణంలోనే మరో సూక్ష్మ జీవి మరింత భయపెడుతున్నది. మనిషి మెదడు తినే అమీబా అమెరికాలో వేగంగా వ్యాపిస్తున్నది. నెగ్లెరియా ఫోవ్లేరిగా పిలిచే ఈ అమీబా ఇదివరకు దక్షిణ అమెరికాకు మాత్రమే పరిమితం కాగా ప్రస్తుతం అమెరికా అంతటా విస్తరిస్తున్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌ 8న టెక్సాస్‌లో ఆరేండ్ల బాలుడు విపరీతమైన తలనొప్పి, వాంతులతో చనిపోయాడు. వైద్య పరీక్షలు నిర్వహించడగా అమీబా కారణమని తేలింది. వాతావరణ మార్పుల కారణంగానే ఈ అమీబా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తున్నట్టు అమెరికాలోని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ పేర్కొన్నది. గడిచిన పదేండ్లలో ఇలాంటివి 34 కేసులు మాత్రమే నమోదైనప్పటికీ అమీబా అమెరికా అంతటా వ్యాపించటం ఆందోళన కలిగిస్తున్నది. కాచి చల్లార్చిన నీటిని తాగడం వల్ల ఈ అమీబాను నిరోధించవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.