DailyDose

స్థిరాస్తిలో భారీ పెట్టుబడులు-వాణిజ్య-05/20

May 20 2019 - Breaking Business News-tnilive - telugu business news

*మౌలిక దిగ్గజం ఎల్ అండ్ టీ మొదటి ప్రాధాన్యతగా మైండ్ ట్రీ కొనుగోలు ఉందని ఎల్ అండ్ టీ గ్రూపు చైర్మన్ ఏఎం నాయక్ వెల్లడించారు. మధ్య స్థాయి సంస్థగా ఉన్న మైండ్ ట్రీని పెద్ద సంస్థగా తీర్చిదిద్దుతామనే ధీమా వ్యక్తం చేశారు.
*దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఆదివారం ముగియగా ఎక్జిట్ పోల్స్ ను వేర్వేరు సంస్థలు ప్రకటించాయి. వస్తావా ఫలితాలు గురువారం వెల్లడి కానున్న నేపద్యంలో మార్కెట్ల నియంత్రణ సంస్థ సేబీతో పాటు స్టాక్ ఎక్చేంజిల తమ నిఘా యంత్రంగాన్ని కట్టుదిట్టం చేశాయి.
*నిర్వహణ సామర్ధ్యాలను మెరుగు పరచడానికి దేశవ్యాప్తంగా 800-900శాఖలను హేతుబద్ద్దీకరణ అవకాశాలను పరిసీలిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
*ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ కు చెందిన ఏడు పవన విద్యుత్ ప్లాంట్లలో 49శతం వాటా ఉన్న జపాన్ ఒరిక్స్ కార్పోరేషన్ మిగిలిన 51 శతం వాటా కూడా కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. స్పెషల్ పర్పస్ వెహికల్ రూపంలో ఉన్న ఈ ఏడూ పవన విద్యుత్ ప్లాంట్లు ఐఎల్ అండ్ ఎఫ్ ఎస్ విండ్ ఎనర్జీ అధీనంలో ఉన్నాయి. పన్నెండు రాష్ట్రాల్లో ఉన్న ఈ ప్లాంట్ల మొత్తం సామర్ధ్యం 874 మెగావాట్లు తాజాగా ఒరిక్స్ మరింత ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సిద్దమైందని తెలిపింది. ఈ కొనుగోలు ప్రక్రీయ జూన్ కు ముగిసే అవకాశం ఉంది.
*దేశీయ స్థిరాస్తి రంగంలోకి ప్రెవేట్ ఈక్విటి సంస్థల పెట్టుబడులు భారీగా వస్తున్నాయ్. పీఈ సంస్థలు గత రెండేళ్ళలో 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడిగా పెట్టాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ నివేదిక వెల్లడించింది. ఎఫ్ డీఐ విధానంలో వచ్చిన మార్పులతోనే ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు పీఈలు ముందుకొచ్చాయని తెలుస్తోంది. మల్టీ బ్రాండ్ రీటైల్ రంగంలో 51 శాతం సింగిల్ బ్రాండ్ రీటైల్ రంగంలో వంద శతం పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంది.
*ఆటోమొబైల్స్‌ విడిభాగాలపై టారీఫ్‌లను మరో ఆరునెలలు వాయిదా వేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు.
*హెచ్‌పీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ అమెరికాకు చెందిన సూపర్‌ కంప్యూటర్ల తయారీదారు క్రే ఐఎన్‌సీని కొనుగోలు చేయనుంది. ఈ డీల్‌ విలువ 1.4 బిలియన్‌ డాలర్లు. భారతీయ కరెన్సీలో రూ.9,848 కోట్లు. హైఎండ్‌ కంప్యూటింగ్‌లో పోటీని ఎదుర్కొనేందుకు ఈ డీల్‌ ఉపయోగపడుతుందని హెచ్‌పీ భావిస్తోంది. ఈ డీల్‌ కింద ఒక్కో షేరుకు 35డాలర్లు (రూ.2,462) చెల్లిస్తోంది. గురువారం షేరు ధర ముగింపు కంటే ఇది 17 ఎక్కువ.
*వచ్చే నెల 6వ తేదీన టొయోటా గ్లాన్జాను మార్కెట్లోకి విడుదల చేయనుంది. దీనిని మారుతీ సుజుకీ బాలినోకు క్లోనింగ్‌గా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పటికే ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.
* ట్రంప్‌ వాణిజ్య యుద్ధంలో శాంతి జెండా ఎగిరింది. కెనడా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే స్టీల్‌ , అల్యూమినియం ఉత్పత్తులపై టారీఫ్‌లను ఎత్తివేశారు. సరికొత్త పశ్చిమ అమెరికా వాణిజ్య ఒప్పందానికి ఆమోద ముద్ర పడేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఈ విషయాన్ని అమెరికా, కెనడా సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. స్టీల్‌ ఉత్పత్తులపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం టారీఫ్‌లను 48 గంటల్లోపు ఎత్తివేయనున్నారు. ఇటువంటి ఒప్పందాన్నే అమెరికా-మెక్సికోలు కూడా చేసుకోనున్నట్లు సమాచారం.
*ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఇరాక్‌లో ఉన్న ఎక్సాన్‌ మొబైల్‌ సంస్థ తమ ఉద్యోగులను అక్కడి నుంచి వెనక్కి పిలిపించింది. ఇరాక్‌ పశ్చిమ కురానా చమురు క్షేత్రాల్లో పనిచేస్తున్న విదేశీ సిబ్బందిని అక్కడి నుంచి దుబాయ్‌కు తరలించింది. శుక్రవారం నుంచే వీరి తరలింపు మొదలై శనివారంతో ముగించింది.