కొబ్బరి తినండి. ఉత్సాహంగా ఉండండి.

శరీరానికి అవసరమైన అన్ని పోషకాలూ ఉండే కొబ్బరి పరిపూర్ణ ఆహార పదార్థం.
*ఔషధ గుణాలు
కొబ్బరిలో ఇతర గింజధాన్యాల స్థాయి ప్రొటీన్ లేకపోయినా ఉన్నంతలో ఆ ప్రొటీన్ చాలా నాణ్యమైనది. ఇందులో పలురకాల అమినో యాసిడ్స్ ఉండడం వల్ల కొబ్బరి ఓ మంచి టానిక్ అన్నమాట. వివిధ వ్యాధులు, రుగ్మతలను నియంత్రించే గుణం ఉండడం వల్ల కొబ్బరిని ఒక ఔషధంగా కూడా పరిగణి స్తారు. రోజూ రెండు చెంచాల పచ్చి కొబ్బరినూనె సేవిస్తే, జీర్ణశక్తి పెరగడంతో పాటు, స్థూలకాయం పైన అదుపు ఏర్పడుతుంది. థైరాయిడ్ సమస్య నియంత్రణకూ ఇది తోడ్పడుతుంది.
*జీవక్రియలకు
కార్బోహైడ్రేట్లు, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, అమినో యాసిడ్లు, కొవ్వు, పొటాషియం, క్యాల్షియం సమృద్ధిగా ఉండే కొబ్బరి పాలు జీవక్రియలను ఉత్తేజితం చేస్తాయి. అందుకే వైద్యులు కొబ్బరిపాలను గొప్ప టానిక్ అంటారు.
*మోకాలి కీళ్లనొప్పులకురోజూ 50 గ్రాముల ఎండు కొబ్బరి తింటూ, 15 నిమిషాల పాటు నొప్పులున్న చోట కొబ్బరి నూనెతో మర్దన చేస్తే మోకాళ్ల నొప్పులు చాలావరకు తగ్గిపోతాయి. మర్దన సమయంలో సూర్యరశ్మిలో నిలుచుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.
*నిద్రలేమి నివారణకు
నిద్రలేమితో బాధపడుతున్న వాళ్లు, రాత్రివేళ పడుకోబోయే ముందు కొబ్బరి నీళ్లు తాగితే గాఢనిద్రలోకి వెళతారు. పైగా ఆ మరునాటి ఉదయం నిద్ర లేచినప్పుడు కొత్త ఉత్తేజం కనిపిస్తుంది. రోజూ కొబ్బరి నీళ్లు తాగితే వీర్యం చిక్కబడి లైంగిక శక్తి కూడా పెరుగుతుంది.
*మూత్ర సమస్యలకు..
క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు కొబ్బరినీళ్లు తాగితే, కిడ్నీలు, పిత్తాశయాల పనితనం పెరుగుతుంది. దీనివల్ల మూత్ర విసర్జనలో ఏవైనా అడ్డంకులు ఉండే తొలగిపోతాయి. పిడికెడు కొబ్బరి ఆకుల పేస్ట్ను కొబ్బరి నీళ్లల్లో కలిపి తాగితే, మూత్ర విసర్జనలో కలిగే మంట తగ్గుతుంది.
*అలసటకు విరుగుడు
ఏ చిన్న పని చేసినా అలసిపోయేవారు, రోజూ పచ్చి కొబ్బరి తింటూ, కొబ్బరి పాలు కూడా తాగితే, ఆ సమస్య తొలగిపోతుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com