Devotional

₹1100కోట్లు ఖర్చు

₹1100కోట్లు ఖర్చు

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అయోధ్యలోని రామమందిర నిర్మాణ పనులు ఈ మధ్యే మొదలయ్యాయి. అయితే, ఆలయ ఖర్చు ఎంత అవుతుందనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతా లేదు. ఈ నేపథ్యంలో ఈ అద్భుత నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలను ఆలయ ట్రస్ట్‌ విడుదల చేసింది. దాదాపు రూ.1100కోట్ల ఖర్చు అవుతుందని లెక్కతేల్చింది. అంతేకాదు ఆలయ నిర్మాణానికి మూడున్నరేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించింది.