“పంజాబ్” నుండి సెహ్వాగ్ ఔట్

ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో తన బంధానికి తెరపడిందని వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విటర్‌ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. రెండు సీజన్‌లు ఆ జట్టు తరఫున ఆడిన సెహ్వాగ్‌.. 2016లో మెంటార్‌గా ఎంపికయ్యాడు. వచ్చే రెండేళ్లకు గాను పంజాబ్‌.. న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌ను జట్టు కోచ్‌గా ఎంపిక చేయడంతోనే సెహ్వాగ్‌ పాత్ర ప్రశ్నార్థకంగా మారింది. ‘రెండేళ్లు ఆటగాడిగా, మూడేళ్లు మెంటార్‌గా పంజాబ్‌ జట్టుతో అద్భుతంగా సాగిన బంధానికి ఇప్పుడు తెరపడింది. భవిష్యత్‌లో ఆ జట్టుకు మంచి జరగాలని కోరుకుంటున్నా’’ అని సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. అయితే దీనికంటే ముందే సెహ్వాగ్‌కు పంజాబ్‌ ఫ్రాంచైజీ నుంచి ఒక మెయిల్‌ వచ్చినట్లు తెలిసింది. ఇక నుంచి జట్టుకు సంబంధించి బ్రాండ్‌ అంబాసిడర్‌ను గానీ, మెంటార్‌ గానీ నియమించుకోవాలని ఫ్రాంచైజీ అనుకోవట్లేదని మెయిల్‌ సారాంశం. ఫ్రాంచైజీ నిర్ణయాన్ని గౌరవించి సెహ్వాగ్‌ తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొన్నాడు. దీనిపై మాట్లాడుతూ.. మెంటార్‌ నియామకం అనేది పూర్తిగా ఫ్రాంచైజీ ఇష్టానుసారం. కావున ఆ ప్రక్రియలో నేను తలదూర్చకూడదనుకున్నానని ఈ మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా, 2018 ఐపీఎల్‌ సీజన్‌లో జట్టు యజమాని ప్రీతిజింటాకు, సెహ్వాగ్‌కు కొన్ని విషయాల్లో మనస్పర్థలు వచ్చాయి. ఈ క్రమంలోనే తనను వదులుకోవాలనుకున్నారేమో.. అని వస్తున్న వార్తలను సెహ్వాగ్‌ కొట్టిపారేశాడు. వాళ్లు నాకు బదులుగా కొత్త మెంటార్‌ని నియమించుకోవాలనుకోవచ్చు. అది పూర్తిగా వారికి సంబంధించిన విషయం. అంతేకానీ దానిని కారణంగా భావించడం లేదని సెహ్వాగ్‌ అన్నాడు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com