* తరగతి గదిలో మొదలైన సాధారణ గొడవ ఓ విద్యార్థి హత్యకు దారితీసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 14 సంవత్సరాల వయసున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థుల మధ్య గదిలో కూర్చునే విషయంలో తగవు ఏర్పడింది. దీంతో ఓ విద్యార్థి కోపంతో ఆర్మీ అధికారి అయిన తన అంకుల్ రివాల్వర్(గన్) తీసుకొని గురువారం పాఠశాలకు వచ్చాడు. ఈ క్రమంలో ఉదయం 11 గంటల సమయంలో క్లాస్ జరుగుతుండగా నిందితుడు ఒక్కసారిగా గొవడపడిన ఆ విద్యార్థిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బాధిత విద్యార్థి తల, ఛాతీ, పొట్ట భాగంలో బుల్లెట్లు దిగాయి. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
* కర్నూలు జిల్లా ఆదోనిలో పరువు హత్య కలకలం రేపింది. పట్టణ శివారులోని ఆర్టీసీ కాలనీ వద్ద ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదోని పట్టణంలోని కిష్టప్పనగర్‌కు చెందిన ఆడం స్మిత్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నారు. పట్టణానికి చెందిన యువతి, ఆడం స్మిత్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వేర్వేరు సామాజికవర్గాలు కావడంతో వీరిద్దరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో రెండు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో వాళ్లిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.
* కోతిని తరిమేందుకు యత్నించి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన లోకేశ్ (30) గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కూకట్‌పల్లిలోని జయనగర్ కాలనీలో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. కరోనా కారణంగా వర్క్‌ఫ్రమ్ హోంలో భాగంగా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నాడు. వీరు నివాసముంటున్న ప్రాంతంలో కోతుల బెడద ఎక్కువ ఉంటోంది.
* వారణాసిలోని ప్రధాని మోదీ కార్యాలయాన్ని కొందరు దుండగులు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన సంఘటన ఇంకా కనుమరుగు కాక ముందే.. అటువంటిదే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈసారి వ్యాపార ప్రచారం కోసం ఏకంగా ప్రధాని, ముఖ్యమంత్రుల చిత్రాలను వాడుకున్న ఓ వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా, ఇతను ఓ ఉత్తర్‌ప్రదేశ్ మంత్రి సోదరుడు కావటం గమనార్హం. నిందితుడు లలిత్ అగర్వాల్ సోదరుడు కపిల్ దేవ్ అగర్వాల్ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యా మంత్రిగా ఉన్నారు.
* సులభ పద్ధతుల్లో వ్యక్తిగత రుణాలిస్తామంటూ లక్షల మందికి అప్పులిచ్చి ఫోన్లలో వారిని బెదిరిస్తూ.. అధిక వడ్డీలతో వసూలు చేసుకుంటున్న యాప్‌ల అక్రమాలు తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తున్నాయి. 30 మంది బాధితుల ఫిర్యాదులతో కేసులు నమోదు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 15 రోజుల్లోనే సంచలన అంశాలను తెలుసుకున్నారు. చైనా దేశస్థులు కొందరు తెరవెనుక ఉండి నడిపిస్తున్న ఈ రుణ దందా ద్వారా కేవలం 6 నెలల్లోనే 1.4 కోట్ల లావాదేవీల ద్వారా రూ.21,000 కోట్ల వ్యాపారం చేశారని గుర్తించారు. ఇది కేవలం ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయం. మరోవైపు రుణాల యాప్‌ల రూపకల్పన, కాల్ సెంటర్ల నిర్వహణలో అన్నీ తానై వ్యవహరించిన చూ వుయ్ అలియాస్ లాంబోను పోలీసులు బుధవారం దిల్లీలో అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు తరలించి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. దిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లాంబోను సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్ బి.రమేష్ దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ నుంచి షాంఘైకి వెళ్తుండగా విమానం ఎక్కేలోపు పట్టుకున్నారు. ఈ నెల 22న గురుగ్రాంలోని రెండు కాల్‌సెంటర్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. లాంబో తన అనుచరుడు నాగరాజుతో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి లాంబో కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఈ కేసులో దిల్లీలో అరెస్టయిన యాన్ యాన్ అలియాస్ జెన్నీఫర్ అనే చైనా దేశస్థురాలిని విచారించారు. ఆమె తెలిపిన సమాచారం ఆధారంగా లాంబో.. అగ్లో టెక్నాలజీస్, ల్యూఫాంగ్, న్యాబ్లూమ్, పిన్‌ప్రింట్ టెక్నాలజీస్ అనే పేర్లతో రుణ యాప్‌లు ప్రారంభించినట్లు తెలుసుకున్నారు. అనంతరం చైనాకు పారిపోతున్నాడన్న కచ్చితమైన సమాచారంతో బుధవారం తెల్లవారుజామున లాంబో, నాగరాజులను అరెస్టు చేసినట్లు అదనపు సీపీ(నేరపరిశోధన) శిఖా గోయల్ తెలిపారు.
* సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 28 నుంచి 30 వరకు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న కేసులు 928 నమోదయ్యాయి. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లోని సాఫ్ట్‌వేర్ కంపెనీల ఉద్యోగులు ఇళ్ల నుంచే పనిచేస్తుండటంతో రోడ్లపై రద్దీ తక్కువగా ఉంది. రాత్రివేళ కొందరు తప్పతాగి అతి వేగంగా నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఎక్కువగా 21-40 ఏళ్ల లోపు వారే .
* ప్రైవేటు బస్సు బోల్తా పడటంతో ఒకరు మృతిచెందిన ఘటన నెల్లూరు జిల్లాలోని గౌరవరం జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ప్రమాదంలో మరో పది మందికి గాయాలయ్యాయి. తమిళనాడు నుంచి కోల్‌కతాకు బయలుదేరిన బస్సు ఈ తెల్లవారుజామున అదుపుతప్పి బోల్తా పడింది. పశ్చిమబెంగాల్‌లోని ముషీరాబాద్‌కు చెందిన వలస కూలీలు ప్రైవేటు బస్సులో వెళుతుండగా ఘటన జరిగింది. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. క్షతగాత్రులను కావలి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.