తానా సభలకు మూడు మిలియన్ల హామీలు-ముగ్గురు చైర్మన్లు!


ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)లో యువతరం పరిపాలన దుమ్మురేపుతోంది. వచ్చే జులై మొదటివారంలో జరిగే తానా మహాసభలకు మంచి కిక్కు ఇచ్చే నిమిత్తం వాషింగ్టన్ డీసీలో శనివారం నిర్వహించిన సదస్సు ఆశించిన ఊపునే ఇచ్చింది. మహాసభల నిర్వహణకు ఈ సభలకు అమెరికా నలుమూలల నుండి హాజరయిన తానా బోర్డు సభ్యులు, ఇతర అభిమానులు భారీగానే హామీలనిచ్చారు. 3మిలియన్ డాలర్లకు పైగా మహాసభలకు విరాళాలను ఇస్తున్నట్ళు హామీలు వచ్చాయని తానా అధ్యక్షుడు వేమన సతీష్ పత్రికా ప్రకటనలు ఇచ్చారు. తొలిసదస్సులోనే ₹20కోట్లకు పైగా నిధుల హామీలు లభించడంతో తానా యువ పాలకమండలి ఉబ్బితబ్బిబ్బవుతోంది. భారీగా వచ్చే నిధులతో మహాసభలను ఘనంగా నిర్వహించటానికి ఇప్పటి నుండే ప్రణాళికలు వేసే పనిలో తానా సభల కమిటీలు నిమగ్నమయ్యాయి. గతంలో ఏ మహాసభలకు లేని విధంగా ఈ మహాసభలకు చీఫ్‌లుగా ముగ్గురిని నియమించడం విశేషం. మహాసభల సమన్వయకర్తగా ముందు నుండి అందరూ భావించిన విధంగా ప్రొ.మూల్పూరి వెంకటరావును నియమించారు. కొత్తగా మహాసభల నిర్వహణకు ఒక చైర్మన్ పోస్టును ప్రవేశపెట్టారు. మరొక ప్రొఫెసర్ కొడాలి నరేన్‌ను చైర్మన్‌గా నియమించారు. 2007లో డీసీలో జరిగిన తానా మహాసభలకు సమన్వయకర్తగా వ్యవహరించి అట్టహాసంగా సభలను నిర్వహించిన డా.యడ్ల హేమప్రసాద్‌ను ఈసారి సలహామండలి చైర్మన్‌గా నియమించారు. జులై నెలలో జరిగే తానా మహాసభల నిర్వహణపైనే ప్రస్తుతం తానా పాలకవర్గం దృష్టి కేంద్రీకరించింది.
22nd tana convention washington dc fundraiser, 3milionUSD, TANA2019, Telugu Association of North America vemana satish, mulpuri venkatarao, yadla hemaprasad, kodali naren

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com