సోంఫు ఒత్తిడిని దూరం చేస్తుంది

భోజనానంతరం సోంపు గింజలు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. అవి దుర్వాసనలను దూరం చేయడమే కాదు చాలాసేపటికి వరకూ నోటిని తాజాగా ఉంచుతాయి. ఈ సోంపు గింజలు ఆరోగ్యానికీ చాలా మంచివి. వీటి నుంచి శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. భోజనం తరవాతే కాదు ముందూ తీసుకోవచ్చు. సోంపులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొవ్వు పెంచే కార్బోహైడ్రేట్లను ఇవి దూరం చేస్తాయి. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా చూస్తాయి. వీటిలో ఉండే పీచు జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. జీవక్రియల రేటు సక్రమంగా ఉండేలా చూస్తుంది. వీటిలో ఉండే పీచు పదార్థాలతో రక్తంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. కనుక గుండెకూ మేలే. అంతేకాదు సోంపును తరచూ తీసుకోవడం వల్ల నాడీవ్యవస్థ బలపడుతుంది. అలానే చెడు కొవ్వును సోంపులోని పోషకాలు గ్రహిస్తాయి. వీటిల్లోని కాపర్ ఎర్రరక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. జింక్ శారీరక ఎదుగుదలకూ, అవయవాలు దృఢంగా ఉండటానికీ తోడ్పడుతుంది. రక్తపోటుతో బాధపడేవారు సోంపు గింజల్ని రోజులో ఒకటి రెండుసార్లు నమిలితే మంచిది. అలా చేయడం వల్ల పొటాషియం శరీరానికి అంది, రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం మెదడులోని నరాలను ఉత్తేజితం చేస్తుంది. కప్పు సోంపులో ఇరవై శాతం పైనే విటమిన్ ‘సి’ ఉంటుంది. అది రోగనిరోధక శక్తిని పెంచడానికీ, చర్మ కణజాలం దృఢపడి, గాయాలైనప్పుడు త్వరగా మానిపోవడానికి దోహదం చేస్తుంది. సోంపు గింజల్లోని ఫ్లవనాయిడ్లు ఒత్తిడిని దూరం చేస్తాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com