“నీకు దణ్ణం పెడతాం…పండుగ పూట ఈ శాండాలం ఆపు తల్లీ…”

కనీసం ఈ దీపావళి రోజైనా బ్రా యాడ్స్‌ పోస్ట్‌ చేయవద్దని బాలీవుడ్‌ నటి దిశా పటానికి సూచిస్తున్నారు నెటిజన్లు. దీపావళి విషెస్‌ తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ అయింది. సంప్రదాయంగా చేతిలో దీపం పట్టుకోని కాల్విన్ క్లైన్ ఇండియా బ్రాండ్‌ స్పోర్ట్స్‌ బ్రా కనిపించేలా ఉన్న ఫొటోను ఈ అమ్మడు షేర్‌ చేసింది. దీంతో ఆగ్రహానికి గురైన నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు. ‘ఏందీ ఈ నాన్సెన్స్‌.. కనీసం పండుగ రోజైన ఇలాంటి డ్రెస్‌లు వేసుకోకు’ అని ఒకరంటే.. దీపావళికైనా ఈ దుస్తుల యాడ్స్‌ ఆపేయని మరోకరు కామెంట్‌ చేశారు.ఇలా 7 వేల కామెంట్స్‌తో చిరాకుపడ్డ దిశాపటాని సింపుల్‌గా ఆ కామెంట్స్‌ తొలగించింది. ఈ ఫొటోకు 15 లక్షలకు పైగా లైక్స్‌ వచ్చాయి. ఇక దిశా పటానిపై ట్రోల్‌ జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో బికినీ ఫొటోలు అప్‌లోడ్‌ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. అప్పట్లో ఈ అమ్మాయికి వేసుకోవడానికి దుస్తులు లేనట్టున్నాయనే కామెంట్స్‌తో నెటిజన్లు ఏకీపరేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com