కైలాస్ మానస సరోవర్ కు సంబంధించి భారత భాగాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చేందుకు ఐరాసకు చెందిన విద్య, శాస్త్ర సంస్కృతిక సంస్థ యునెస్కో అంగీకరించిందని కేంద్ర సంస్కృతిక వ్యవహారాల శాఖ ఆదివారం తెలిపింది. ఏప్రిల్ లో భారత పురావస్తు విభాగం పంపిన ప్రతిపాదనల పై ఈ మేరకు ఆమోదముద్ర లభించినట్లు వివరించింది. కైలాస్ మానస సరోవర్ మిశ్రమ విభాగంలో ఉందని ఆ ప్రాంతం సహజ సాంస్కృతిక వారసత్వ విభాగాల్లో ఉందని తెలిపింది. కైలాస్ మానస సరోవర్ ప్రాంతం భారత్ లో 6,836 చదరపు కి.మీలో విస్తరించి ఉంది. తూర్పున నేపాల్, ఉత్తరాన చైనా ఉంది. మూడు దేశాల్లో కలిపి 31 చదరపు కిమీ ప్రాంతలో వ్యాపించింది. అందులో కైలాస్ పర్వతం మానస సరోవర్ సరస్సు ఉన్నాయి. ప్రపంచ వారసత్వ స్థాలిగా ఈ పవిత్ర ప్రదేశాన్ని గుర్తించాలని యునెస్కోకు చైనా, నేపాల్ ఇప్పటికే ప్రతిపాదించాయి.
కైలాస మానసరోవర్కు యునెస్కో గుర్తింపు
Related tags :