తిరుమలలో ఘనంగా దీపావళి ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ‘దీపావళి ఆస్థానాన్ని’ టిటిడి ఘనంగా నిర్వహించింది.

ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య (దీపావళి) నాడు యథాప్రకారంగా శ్రీవేంకటేశ్వరస్వామివారికి సుప్రభాతం మొదలుకొని మొదటిగంట నివేదన వరకు ఈ వేడుక జరిగింది.

ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలోనికి వేంచేశారు.

ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామిని బంగారువాకిలి ముందు ఏర్పాటు చేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వారులకు అభిముఖంగా ఏర్పాటు చేసి,సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేసారు.

ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు.

దీంతో దీపావళి ఆస్థానం పూర్తి చేశారు.. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన తిరుప్పావడ సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవాలను టిటిడి రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించింది .

ఇకసహస్రదీపాలంకార సేవలకు యథావిధిగా భక్తులను అనుమతిస్తారని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com