తమన్నా రచనలు

మన కథానాయికలు బయటికి ఒక కోణంలోనే కనిపిస్తారు కానీ… వాళ్లలో చాలా విద్యలే దాగున్నాయి. సృజనాత్మకతతో కూడిన సినిమా రంగమే మాకు అవన్నీ నేర్పించిందని చెబుతుంటారు చాలామంది. అందులో తమన్నా ఒకరు. ఇంతకీ ఈమెలో బయటికి కనిపించని కళ ఏమిటో తెలుసా? రచన. ఖాళీ దొరికినప్పుడు, మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు కలం చేత పడుతుందట. ఇంతకీ ఏం రాస్తుంటారని అడిగితే మాత్రం ‘‘ఇప్పుడే చెప్పను. దానికి సమయం రావాలి’’ అంటోంది. మరి తమన్నా సినిమా కథలే రాస్తుందో కవిత్వం రాస్తుందో తెలియాలంటే ఆమె చెప్పేవరకు ఆగాల్సిందే. రాయడం అనేది సినిమా రంగం నుంచే అలవాటైందని చెబుతోందామె.‘పాఠశాల వయసులోనే నేను చిత్ర పరిశ్రమకొచ్చా. జీవితమైనా, సృజనాత్మకతకు సంబంధించిన విషయాలైనా చిత్ర పరిశ్రమని చూసే నేర్చుకొన్నా. నన్ను తీర్చిదిద్దింది సినిమా సెట్టే కదా’’ అంటోంది తమన్నా. ప్రస్తుతం ఆమె ‘దటీజ్ మహాలక్ష్మి’, ‘ఎఫ్2’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com