ScienceAndTech

మార్స్ మీదకి చైనా కాలు

మార్స్ మీదకి చైనా కాలు

అరుణ గ్రహంపైకి చైనా ప్రయోగించిన టియాన్‌వెన్‌-1 పరిశోధక నౌక ప్రయాణం కొనసాగుతోంది. జులై 23న వెన్‌ఛాంగ్‌ అంతరిక్ష ప్రయోగశాల నుంచి లాంగ్‌మార్చ్‌-5 రాకెట్‌ ద్వారా దీన్ని ప్రయోగించారు. టియాన్‌వెన్‌ ఇప్పటి వరకు 400 మిలియన్‌ కిలోమీటర్లకు పైగా ప్రయాణించినట్లు చైనా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (సీఎన్‌ఎస్‌ఏ) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. మరో నెల రోజుల్లో అరుణ గ్రహం కక్ష్యలోకి ప్రవేశించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వాహకనౌక గమన మార్గమంతా సాధారణంగానే ఉందని, అంగారకుడి కక్ష్యలోకి వెళ్లిన తర్వాత నౌక వేగం క్రమంగా తగ్గుతూ వస్తుందని చెప్పింది. సేఫ్‌ ల్యాండింగ్‌ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపింది.