పర్పుల్ టీ కోసం పదివేలు

గ్రీన్ టీ, బ్లాక్ టీల గురించి వినే ఉంటారు. కొందరు చూసి ఉంటారు. చాలా మంది తాగే ఉంటారు. కొత్తగా ఈ పర్పుల్ టీ ఏంటనుకుంటున్నారా? ఈ ఖరీదైన టీ గురించి చదువండి.మీకు తెలిసిన టీలు ఎన్ని? అవి ఏవి? అంటే సమాధానం మహా అయితే పది పేర్లు చెప్తారేమో. కానీ ప్రపంచవ్యాప్తంగా వంద కాదు, వెయ్యి కాదు 1500 రకాల టీలున్నాయని మీకు తెలుసా? అందులో ఈ పర్పుల్ టీ ఒకటి. ఇది భారతదేశంలో తక్కువ ప్రదేశాల్లో లభిస్తున్నది. ఈ టీ ఆకును కొన్ని చోట్లనే సాగు చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో దీన్ని పండిస్తున్నారు. ప్రయోగాత్మకంగా పండించిన పంట విజయవంతమైంది. ఇక్కడ వాతావరణ పరిస్థితులకు ఆ పంట తట్టుకోగలిగింది. కాబట్టి దేశంలో ఎక్కడైనా పండించవచ్చని చెబుతున్నారు నిపుణులు. దీని జాతి విత్తనం కెన్యా దేశం నుంచి వచ్చిందని అక్కడి రైతుల నమ్మకం. 2015లో టోక్లాయి టీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఈ టీ మీద అధ్యయనం చేసింది. ఒక కేజీ పర్పుల్ టీ తయారీకి పది వేల రూపాయల ఖర్చు అవుతుంది. చూడడానికి ఆకర్షించేలా ఉన్న ఈ టీ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కాస్మొటిక్ ప్రొడక్ట్స్ తయారీలో పర్పుల్ టీ ఆకులను వాడుతుంటారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com