దేశం విడిచి పొమ్మంటే ఎలా?

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ పుట్టిన రోజున అతడి పేరిట ఉన్న యాప్‌ విడుదల సందర్భంగా కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాల పర్వం కొనసాగుతోంది. అభిమానిని దేశం విడిచి వెళ్లిపొమ్మంటూ కోహ్లీ చేసిన వ్యాఖ్యలకు గానూ ఇప్పటికే నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై హీరో సిద్ధార్థ స్పందించారు.దీనిపై ఆయన ట్వీట్‌ చేశారు. ‘టీమిండియా సారథి నుంచి ఎంత చెత్త మాటలు వచ్చాయి.కింగ్‌ కోహ్లీగా కొనసాగాలంటే నీకు నువ్వు టీచ్‌ చేసుకోవాల్సిన సమయం ఇది. భవిష్యత్‌లో ఇలా మాట్లాడేటప్పుడు ద్రవిడ్‌ ఏం చెప్పాడో వాటి గురించి ఒకసారి ఆలోచించు.’ అంటూ కోహ్లీని ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ఈనెల 5న కోహ్లీ తన పుట్టినరోజు జరుపుకొన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన పేరిట ఉన్న యాప్‌ను కోహ్లీ విడుదల చేశాడు. ఇందులో భాగంగా యాప్‌ ద్వారా అభిమానుల ట్వీట్లను చదువుతుండగా ఓ అభిమాని కోహ్లీని ఉద్దేశించి చేసిన ట్వీట్‌ను చదివాడు. ‘ఓవర్‌ రేటెడ్‌ బ్యాట్స్‌మెన్‌. చూడటానికి అతని బ్యాటింగ్‌లో ప్రత్యేకత ఏమీ ఉండదు. ఇండియన్ల కంటే ఇంగ్లీష్‌ ఆటగాళ్లు, ఆస్ట్రేలియా ఆటగాళ్ల బ్యాటింగ్‌ ను నేను బాగా ఆస్వాదిస్తాను’ అంటూ కోహ్లీని ఉద్దేశించి ఓ అభిమాని ట్వీట్‌ చేశాడు. అభిమాని ట్వీట్‌ను ఉద్దేశించి కోహ్లీ మాట్లాడుతూ…‘నాకు తెలిసి నువ్వు ఇండియాలో నివసించాల్సిన అవసరం లేదు. వెళ్లి ఇంకెక్కడయినా నివసించు.వేరే దేశాలను ఇష్టపడేటప్పుడు నువ్వు మనదేశంలో ఎందుకు నివసిస్తున్నావ్‌? నువ్వు నన్ను అభిమానించాలని నేను అనుకోవడం లేదు. నువ్వు ఇతర దేశాలను అభిమానించేటప్పుడు మనదేశంలో ఉంటడంలో అర్థం లేదు’ అంటూ సమాధానమిచ్చాడు. దీనిపై నెటిజన్లు కోహ్లీపై మండిపడుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com