త్వరలో “ఇంటెల్” హైదరాబాద్

హైదరాబాద్ నగరానికి మరో తలమానికం లాంటి పెట్టుబడి రానున్నది. ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఇంటెల్ సంస్థ హైదరాబాద్ లో టెక్నాలజీ సెంటరును ఏర్పాటు చేయనున్నది. భారతదేశంలో కంపెనీ విస్తరణ కార్యకలాపాలకు ఇంటెల్ సంస్థ హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నది. ఈ మేరకు ఈరోజు ఇంటెల్ ఇండియా అధిపతి నివృతి రాయ్ మంత్రి కేటీ రామారావుతో బేగంపేట క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. టెక్నాలజీ సెంటర్ ద్వారా ఇంటెల్ సుమారు 1500 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన ఐటీ ఉద్యోగులను నియమించుకోనున్నది. భవిష్యత్తులో ఈ సంఖ్య 5వేల వరకు కూడా పెరిగే అవకాశం ఉన్నది. మంత్రితో జరిగిన సమావేశంలో తెలంగాణలో ఉన్న ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ గురించి చర్చ జరిగింది. త్వరలోనే మంత్రి ఇంటెల్ గ్లోబల్ సీఈఓతో సమావేశం అయ్యే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఉన్న కంప్యూటర్ సర్వర్ల, ఎలక్ట్రానిక్స్ , సెమీ కండక్టర్ పరికరాల తయారీకి అవసరమైన అనుబంధ పరిశ్రమల తయారీ సామర్థ్యం, అందుబాటులో ఉన్న అవకాశాల గురించి ఈ సందర్భంగా కంపెనీ బృందం ప్రభుత్వ అధికారులతో చర్చించింది

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com