NRI-NRT

రాయలసీమ తెలంగాణాల్లో తానా సేవా కార్యక్రమాలు

TANA Charity In Telangana And Rayalaseema

* హైదరాబాద్‌లో….
అక్టోబర్ నెలలో తానా ఆధ్వర్యంలో అంతర్జాలంలో నిర్వహించిన బంగారు బతుకమ్మ-2020 కార్యక్రమంలో క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు ఇచ్చిన హామీలో భాగంగా సోమవారం నాడు హైదరాబాద్‌కు చెందిన క్యాన్సర్ రోగులకు లక్ష రూపాయిలను అందజేసినట్లు తానా మహిళా సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త తూనుగుంట్ల శిరీష ఓ ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే సీతక్క, తాళ్లూరి శ్రీధర్, మిట్టపల్లి సురేశ్, యలవర్తి శ్రీని, సామినేని రవి, వాసిరెడ్డి వంశీ, పంత్ర సునీల్‌లు ఈ మొత్తాన్ని అందజేసేందుకు తోడ్పడినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించిన బృందాన్ని తానా కార్యవర్గం అభినందించింది.

* కర్నూలులో…
కర్నూలు నగరపాలక సంస్థకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రధాన కార్యదర్శి పొట్లూరి రవి, వంశీ గ్రూప్ అధినేత ముప్పా రాజశేఖర్ సంయుక్తంగా రూ.7 లక్షల విలువైన రెండు పారిశుద్ధ్య వాహనాలను అందజేశారు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‍ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ద్వారా మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీకి వాహన పత్రాలను అందించారు.