Politics

అఖిలప్రియ అరెస్ట్. జడ్జి ఎదుట హాజరు-నేరవార్తలు

అఖిలప్రియ అరెస్ట్. జడ్జి ఎదుట హాజరు-నేరవార్తలు

* బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు ఏ2 నిందితురాలిగా చేర్చారు. కేసు వివరాలను హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తులో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌కు ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు. కిడ్నాప్‌ కేసులో ఏ1గా ఏవీ సుబ్బారెడ్డి, ఏ2గా అఖిలప్రియ, ఏ3గా భార్గవ్‌రామ్‌ ఉన్నారన్నారు. ఉదయం 11 గంటలకు భూమా అఖిలప్రియను అరెస్టు చేసినట్లు తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. కాసేపట్లో సికింద్రాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు.హఫీజ్‌పేట్‌లో ఉన్న భూమికి సంబంధించి ఏడాది నుంచి వివాదం నడుస్తోందని సీపీ వెల్లడించారు. కిడ్నాప్‌ ఘటనలో ఇతరుల ప్రమేయం కూడా ఉన్నట్లు తేలిందని.. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. ఏపీ పోలీసుల సాయంతో మిగతా నిందితులను కూడా అరెస్టు చేస్తామన్నారు. కిడ్నాప్‌ కేసును మూడు గంటల్లోనే ఛేదించినట్లు సీపీ పేర్కొన్నారు.నిన్న రాత్రి మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు ఆయన సోదరులు సునీల్‌, నవీన్‌లు కిడ్నాప్‌కు గురయ్యారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. కిడ్నాపర్లు ఈ ముగ్గురినీ నార్సింగి వద్ద వదిలి పరారయ్యారు.అఖిలప్రియ సోదరుడు జగద్విఖ్యాత్‌రెడ్డి, ఫాంహౌస్‌ కాపలాదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అఖిలప్రియ భర్త భార్గవరామ్‌, ఆయన సోదరుడు చంద్రహాస్‌, మిగతావారు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. అఖిలప్రియను జడ్జి ముందు హాజరుపర్చిన పోలీసులు.

* ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కూకట్‌పల్లిలోని నివాసంలో ఆమెతోపాటు బంధువులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అఖిలప్రియను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. బోయిన్‌పల్లిలో చోటుచేసుకున్న కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. అయితే ఆమె భర్త భార్గవరామ్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. అఖిలప్రియను బేగంపేటలోని లెర్నింగ్‌ సెంటర్‌కు పోలీసులు తీసుకెళ్లి ప్రశ్నించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని సిటీ సివిల్‌ కోర్టులో అఖిలప్రియను హాజరుపరచనున్నారు.
బోయిన్‌పల్లిలో నిన్న రాత్రి బ్యాడ్మింటన్‌ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్‌రావు, ఆయన సోదరుల అపహరణ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురి కిడ్నాప్‌ వ్యవహారంలో అఖిలప్రియ దంపతుల ప్రమేయంపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రాథమిక సమాచారం సేకరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఓ భూవివాదానికి సంబంధించి ప్రవీణ్‌రావు కుటుంబానికి, భూమా అఖిల ప్రియ కుటుంబానికి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. సికింద్రాబాద్‌లోని బోయిన్‌పల్లి మనోవికాస్‌ నగర్‌లోని తమ స్వగృహంలో ఉన్న ప్రవీణ్‌రావు, ఆయన సోదరులు సునీల్‌రావు, నవీన్‌రావును మంగళవారం రాత్రి 7.20 గంటల సమయంలో సినీ ఫక్కీలో దుండగులు అపహరించారు. మూడు కార్లలో వారి ఇంటికి వెళ్లిన దుండగులు ఐటీ అధికారులమంటూ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ముగ్గురు సోదరులను బెదిరించి వారితో పాటు ల్యాప్‌టాప్‌, చరవాణిలను కూడా పట్టుకుపోయారు. ఆ ముగ్గురు కిడ్నాప్‌నకు గురైనట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ స్పష్టం చేశారు. బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ ముగ్గురిని వికారాబాద్‌లో గుర్తించారు.

* కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డలో తండ్రీ, కొడుకులపై హత్యాయత్నం కలకలం రేపుతోంది. రేపు పెళ్లి జరగనున్న యువకుడిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు.

* విశాఖపట్నం పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం సంభవించింది..జేపీఆర్‌ ల్యాబ్స్‌లో మంగళవారం అర్ధరాత్రి మూడు సార్లు పేలుళ్లు చోటుచేసుకున్నాయి.

* కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి కి రూ. 25 వేల జరిమానా..కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కు హైకోర్టు రూ. 25 వేల జరిమానా విధించింది.ఓ కేసులో దర్యాప్తు కొనసాగకుండా అర్జీ వేసినందుకు గాను కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.బెంగళూరు సమీపం లోని గంగేనహళ్లిలో 1.11 ఎకరాల భూమి డీనోటిఫికేషన్ ద్వారా యడియూరప్ప లబ్ధి పొందారన్న ఆరోపణలపై 2015 లో కేసు నమోదైంది.కలబురగి హైకోర్టు సంచార బెంచ్‌ లో సామాజిక కార్యకర్త జయకుమార్ హీరేమఠ ఈ పిల్ దాఖలు చేశారు.