మేక మాంసం రకాలు-వైద్యంలో వాటి వినియోగం

ఇది మనం తీసుకునే ఆహారాలలో మిక్కిలి ఉపయోగకరం అయినది. శరీరపుష్టి , బలముని ఇచ్చును.

సర్వేంద్రియములకు పుష్టిని , బలముని ఇచ్చును. మితముగా పుచ్చుకొనిన అమృతతుల్యముగా పనిచేయును.

ఆరోగ్యంని ఇచ్చును. అమితముగా పుచ్చుకొనిన అజీర్ణం , అగ్నిమాంధ్యం జేయును.

మాంసం ఒక ప్రత్యేక పద్ధతిలో వండటం వలన అమిత బలం కలుగజేయును . అల్లము , యాలుక్కాయలు , లవంగములు , దాల్చినచెక్క , గసగసాలు మొదలగు ద్రవ్యములు నూరిన ముద్ద మాంసముకు పట్టించి ఉప్పు , కారం కొద్దిగా చేర్చి ఉల్లిపాయ ముక్కలు , కొద్దిగా వెల్లుల్లి చేర్చి , పొయ్యిమీద వేసి అందులో వూరు నీరు ఇగిరిన తరువాత నెయ్యి తో పొంగించి అప్పుడు పెరుగు గాని ,నీరుగాని తగుమాత్రం వేసి వండింది శ్రేష్టం . నూనె వేసి వండినది అంత శ్రేష్టం కాదు

. అన్ని రంగుల మేకమాంసం కంటే నల్ల రంగు మేక మాంసం అత్యంత శ్రేష్టం అయినది.

వయస్సులో ఉన్న మేక మాంసం , బలంగా ఉన్నటువంటి , బయట తిరిగి మేసిన మేక మాంసం , వృషణములు తీసినటువంటి మేకమాంసం తీసుకోవడం వలన అత్యంత బలంగా పనిచేయను.

అన్నిటికంటే ఒక సంవత్సరం వయస్సు ఉండి వృషణములు తీసిన గొర్రెపోతు మాంసం అత్యంత శ్రేష్టం . మేకపోతు మాంసం కంటే ఆడమేక మాంసం మంచిది. ఆడగొర్రె మాంసం కంటే పొట్టేలు మాంసం మంచిది .

మాంసం అధికముగా పుచ్చుకొనుట వలన కలుగు అజీర్ణముకు విరుగుళ్లు

* ఉప్పు .

* ఆవాల చూర్ణం .

* మామిడి పప్పు .

* వేడి నీరు.

* జాజికాయ .

అంతకు ముందు పోస్టులో మీకు మాంసంలో శ్రేష్టమైనది , వండే విధానం గురించి వివరించాను.

ఈ పోస్టులో మీకు మాంసానికి ఏయే పదార్ధాలు చేర్చడం వలన ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో మీకు వివరిస్తాను.

* మాంసం లో ఆకుకూరలు లేక కాయగూరలు కలిపి వండటం వలన ఫలితం –

రుచిగా ఉండును . బలము , దేహపుష్టిని ఇచ్చును. ఏయే ఆకు , కూరగాయ వేసి వండితే ఆ గుణం ఆ మాంసంకి వచ్చును.

కొయ్య తోటకూర వేసి వండినచో రుచిగా , మనోహరముగా ఉండును. శరీరముకు వేడిని కలిగించును. వాతంని అణుచును .

మెంతికూర వేసి వండినచో రుచిగా ఉండును. శరీరము నందుగల ధాతువులకు సౌమ్యత , బలముని ఇచ్చును. హుద్రోగమును నివారించును.

హుద్రోగరోగులు తప్పకుండా తినవలెను. త్రిదోషహరం అయి ఉండును. వీర్యపుష్టిని కలగజేయును .

మామిడికాయ వేసి వండినది రుచిగా ఉండును. వేడిజేయును . పైత్యం , శ్లేష్మం ని తగ్గించును . గుండెజబ్బుని తగ్గించును . వాతముని అణుచును.

వంకాయ వేసి వండినది జీర్ణశక్తిని పెంచును. వాతము , శ్లేష్మముని హరించును. జ్వరము , మూలవ్యాధిని కలుగజేయును . శరీరం నందు వేడిని పెంచును.

మునగకాయ వేసి వండినది మిక్కిలి రుచిగా ఉండును. మేహశాంతి చేయును .జఠరాగ్ని వృద్ధిని చేయను . వీర్యవృద్ధిని చేయను .

చిక్కుడు కాయ వేసి వండినది రుచిగా ఉండును. శరీరంలో పైత్యాన్ని చేయును . అజీర్తి చేయును .

* మాంసం నిప్పుల మీద కాల్చినది –

మాంసం ముక్కలుగా కోసి మెత్తగా నలుగగొట్టి అల్లం , ఉప్పు చేర్చి పుల్లకు కాని ఇనుప వూచకు గాని గ్రుచ్చి నిప్పు మీద కాల్చిన మాంసం రుచిగా ఉండును. శీఘ్రంగా జీర్ణం అగును. వేడిచేయును . కొవ్వుని పెంచును. శ్లేష్మముని పోగొట్టును . మూత్రరోగముని పొగొట్టును. జీర్ణశక్తిని పెంచును. బలముని జేయును . వాత శరీరం కలవారికి మిక్కిలి మంచిని చేయును . సులభముగా జీర్ణం అగును .

* మాంసం ఎండించినది దాని లక్షణము –

అనగా కొద్దిగా ఉప్పు , అల్లము లేక కారము , మసాలాలు నూరి మాంసముకు పట్టించి ఎండించినది . దీనిని కొంచం సాగగొట్టి పలుచగా చేసి నేతిలో వేయించి పుచ్చుకొనిన మిక్కిలి రుచిగా ఉండును. పథ్యములో ఉపయోగించవచ్చు. దేహపుష్టి చేయును . బలం కలిగించును. శరీర కాంతి , బుద్ధిబలం పెంచును . శరీరం ఉబ్బుని తీసివేయును .

* తినకూడని మాంసం –

వ్యాధిచేతను , విషప్రయోగం చేతను , నీటిలో పడిచనిపోయిన లేక పొగవలన చనిపోయిన మరియు శరీరం కృశించుట చేత చనిపోయిన జంతువు యొక్క మాంసం తినరాదు . శరీరం నందు వ్యాధులు జనించును.

* మాంసం నందు కొబ్బరికాయ వేసి వండటం వలన ఫలితం –

రుచిగా ఉండును . దేహపుష్టి చేయును . శరీరం నందు పైత్యంని కలిగించును.

* మాంసం దుంపలు వేసి వండటం వలన ఫలితం –

అనగా మాంసం నందు కర్రపెండలం , బంగాళా దుంప మొదలగు గడ్డలు వేసి వండటం వలన శరీరం లో వాతముని విపరీతంగా పెంచును . వీర్యపుష్టి , దేహపుష్టిని చేయును .

* మాంసం నందు పెరుగు వేసి వండటం వలన కలుగు ఫలితం –

మిక్కిలి రుచిగా ఉండును. బలం , దేహపుష్టి , వీర్యపుష్టిని ఇచ్చును. సులభముగ జీర్ణం అగును. శరీరం నందుగల వాత , పిత్త , కఫ దోషాలను హరించును . వీర్యవృద్దిని కలుగజేయును . నోటివెంట రక్తం పడు రక్తపైత్య రోగముని హరించును .

మాంసం తినకూడని వారు –

నూతనముగా జ్వరం తగిలినవారు ,ఉదర సంబంధ సమస్యలు ఉన్నవారు , కుష్టు రోగులు , ఆకలి మందం కలవారు , కలరా వ్యాధిగ్రస్తులు ,

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com