ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాఒటెక్స్) సంస్థ 2021 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 3 వ తేదీన డాలస్ లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాలేటి లక్ష్మీ అన్నపూర్ణ నూతన అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. 2020 టాంటెక్స్ ఎన్నికల అధికారి జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఎన్నికలు నిర్వహించారు. పూర్తి వివరాలు దిగువ చూడవచ్చు.
*** 2021 కార్యనిర్వాహక బృందం:
అధ్యక్షులు : లక్ష్మి అన్నపూర్ణ పాలేటి
ఉత్తరాధ్యక్షుడు : ఉమా మహేష్ పార్నపల్లి
ఉపాధ్యక్షుడు : శరత్ రెడ్డి ఎర్రం
కార్యదర్శి : కల్యాణి తాడిమేటి
సంయుక్త కార్యదర్శి : శ్రీ కాంత్ రెడ్డి జొన్నల
కోశాధికారి: చంద్ర శేకర్ రెడ్డి పొట్టిపాటి
సంయుక్త కోశాధికారి: స్రవంతి ఎర్రమనేని
తక్షణ పూర్వాధ్యక్షులు: కృష్ణా రెడ్డి కోడూరు
*** కార్యవర్గ బృందం:
లోకేష నాయుడు కొణిదల, మల్లిక్ రెడ్డి కొండా, వెంకటేష్ బొమ్మ, చంద్రా రెడ్డి పోలీస్, ప్రభాకర్ రెడ్డి మెట్టా, రఘునాధ రెడ్డి కుమ్మెత్త, సరిత రెడ్డి ఈదర, నీరజ కుప్పాచి, ఉదయ్ కిరణ్ నిడగంటి, భాను ప్రకాష్ వెనిగళ్ళ, నాగరాజ్ చల్లా, సురేష్ పాతినేని, సుబ్బా రెడ్డి కొండు
*** పాలక మండలి బృందం:
అధిపతి : డా. పవన్ పామదుర్తి,
ఉపాధిపతి: వెంకట్ ములుకుట్ల
శ్రీ కాంత్ పోలవరపు, శ్రీలక్ష్మి మండిగ, గీతా దమ్మన్న, అనంత మల్లవరపు, డా. భాస్కర రెడ్డి శనికొమ్ము.
మరిన్ని వివరాలకు www.tantex.orgని సందర్శించండి. మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి కోడూరు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.