బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరిగింది. ఆమెకు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు కోర్టులో కౌంటరు దాఖలు చేశారు. అఖిలప్రియపై తప్పుడు కేసులు పెట్టే ఉద్దేశం తమకు లేదని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మరిన్ని సాక్ష్యాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయని.. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉందని చెప్పారు. అఖిలప్రియకు బెయిలిస్తే సాక్షులను బెదిరించే అవకాశముందని.. ఆమె చర్యల కారణంగా స్థానిక ప్రజల్లో అభద్రతాభావం నెలకొందని కోర్టుకు తెలిపారు. ఆమెకు ఆర్థికంగా, రాజకీయంగా కేసును ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉందన్నారు.
అఖిలప్రియను వదిలిపెడితే ప్రమాదం
Related tags :