బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. అద్భుతమైన నటనకు తోడు, ఆయన వాయిస్ బంగారానికి తావి అబ్బిందా అన్నట్టుగా అతికిపోతుంది. అలనాటి ‘దో బూంద్ జిందగీ కే లియే’ అనే పోలీయో వ్యాక్సిన్ యాడ్ నుంచి, ఈనాటి కరోనా వైరస్ కాలర్ ట్యూన్ వరకూ ఆయన వాయిస్ విన్నవారెవ్వరైనా బిగ్‌బీకి ఫిదా అవ్వకు మానరు. అయితే ఇపుడు అమితాబ్ గళమే ఆయనను ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే కరోనా కాలర్‌ట్యూన్ వాయిస్‌కు బిగ్‌బీ అనర్హుడంటూ ఢిల్లీకి చెందిన ఓ సామాజిక కార్యకర్త కోర్టులో పిటిషన్ వేశారు. అమితాబ్ గొంతును ఆ కాలర్‌ట్యూన్ నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. కాలర్ ట్యూన్లో జాగ్రత్తలు బోధిస్తున్న అమితాబ్ స్వయంగా కరోనా బారిన పడ్డారని, ఇక ఆయన ఎలా సలహా ఇస్తారని పిటిషనర్ వాదించారు. ఆయనే సరైన జాగ్రత్తలు తీసుకోలేకపోయారు కదా అరోపించారు.
అమితాబ్ అనర్హుడు
Related tags :