Movies

D43

D43

విభిన్న చిత్రాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌ కొత్త చిత్రం శుక్రవారం ప్రారంభమయ్యింది. కార్తీక్‌ నరేన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘D43’అనే వర్కింగ్‌ టైటిల్‌పై పూజా కార్యక్రమం నిర్వహించారు. మాళవికా మోహన్‌ ధనుష్‌ పక్కన నటిస్తోంది. సత్యజ్యోతి ఫిల్మ్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాష్‌ స్వరాలు అందిస్తున్నారు. ‘అసురన్‌’వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత ధనుష్‌ గతేడాది ‘పటాస్‌’తో కోలీవుడ్‌లో హిట్‌ కొట్టాడు. ‘లోకల్‌ బాయ్‌’గా తెలుగులో డబ్‌ అయిన ఆ చిత్రం ఇక్కడ యావరేజ్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో ధనుష్‌కు మంచి మార్కెట్‌ ఉన్న సంగతి తెలిసిందే.