ఇండియా మంచి దేశం

వర్తకం, వాణిజ్యం విషయంలో భారత్‌ బలమైన సంధానకర్త అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొనియాడారు. భారత్‌తో మరింత మెరుగైన వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకునేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వ్యాఖ్యానించారు. మంగళవారం శ్వేతసౌధంలో నిర్వహించిన దీపావళి వేడుకల్లో ట్రంప్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆయన పాలక వర్గంలోని భారతీయ అమెరికన్లు సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అమెరికా అధ్యక్షుడు.. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌తో అమెరికాకు బలమైన సంబంధాలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వ్యక్తితో స్నేహం ఉండడం గొప్పగా భావిస్తున్నాను. భారత్‌తో ఇంకా మెరుగైన వర్తక, వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం.’’ అని ట్రంప్‌ అన్నారు.శ్వేత సౌధంలోని చరిత్రాత్మక రూస్‌వెల్ట్‌ హాలులో నిర్వహించిన ఈ వేడుకలో 25 మంది వరకూ భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. ట్రంప్‌ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి అమెరికాలో భారత దౌత్యవేత్త నవ్‌తేజ్‌ సింగ్‌ సర్ణా దంపతులు హాజరయ్యారు. ‘‘శ్వేత సౌధంలో ఈ పండుగ వేడుకను నిర్వహించడం నేను గౌరవంగా భావిస్తున్నాను. వేడుక జరుపుకొనేందుకు అందరం ఒక్క చోట కలిశాం. భారత్‌ సహా ఆగ్నేయాసియా దేశాలకు చెందిన ఎంతో మంది అమెరికాలో సేవలందిస్తున్నారు. లక్షల మంది ఇతర దేశాల వారికి అమెరికా వేదికైంది. వీరంతా అమెరికా కుటుంబంలో చేరినందుకు గర్వించాలి.’’ అని ట్రంప్‌ అన్నారు.డొనాల్డ్‌ ట్రంప్‌ దీపావళి వేడుకల్లో పాల్గొనడం వరుసగా ఇది రెండోసారి. గతేడాది కూడా వైట్‌హౌజ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2003లో మొదటిసారి దీపావళి వేడుకలను శ్వేతసౌధంలో నిర్వహించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com