* పట్టణంలో అశోక్ నగర్ లో ఆలేఖ్య ఫంక్షన్ హాల్ వద్ద మహిళ దారుణ హత్య.మృతురాలి పేరు యశోద అలియాస్ స్వాతి.ఆమెను ఉంచుకున్న మల్లికార్జున అనే వ్యక్తి నే చంపినట్టు అనుమానం.మృతురాలికి ఇదివరలో శంకర్(కడ్డీల పని)చేసుకొనే వ్యక్తి తో వివాహం జరిగింది అతని ద్వారా ఈమెకు ఇద్దరు మగపిల్లలు.భర్తను విడిచిపెట్టి ఆటో తొలుకునే మల్లికార్జునతో సహజీవనం చేస్తున్న వైనం.సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* మధిర నవయుగ హోటల్ దగ్గర అతివేగంతో ట్రాక్టర్ ను ఢీకొన్న సుబాబుల్ లారీ …..ట్రాక్టర్ డ్రైవర్ కు తీవ్ర గాయాలు…..లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది.
* దేవాలయాలపై పోలీసులు కొనసాగిస్తున్న నిఘా క్రమంలో గుప్త నిధుల తవ్వకాల ముఠా కదిరి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని తనకల్లు మండలంలో పట్టుబడినట్లు జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు వివరాలను వెల్లడించారు. ముటా పట్టుబడిన వైనాన్ని జిల్లా ఎస్పీ వివరించారు. ఇటీవల రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు పెరిగిన నేపథ్యంలో కదిరి డీఎస్పీ భవ్య కిషోర్ ఆదేశాలమేరకు కదిరి రురల్ సీఐ తమ్మిశెట్టి మధు, తనకల్లు ఎస్ఐ శ్రీనివాసులు తనకల్లు మండలం లో పర్యవేక్షణ కొనసాగించినట్లు తెలిపారు. మండలం లోని దిగువచెక్కవారిపల్లి సమీపంలోని నల్లగుట్ట వద్ద పురాతన గుహలో గుప్తనిధుల కోసం త్రవ్వే ప్రయత్నంలో గుప్తనిధుల ముఠా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు వెల్లడించారు.
* పశ్చిమ గోదావరి జిల్లా లోని కొయ్యలగూడెం, గోపాలపురం, బుట్టాయగూడెం, తాళ్ళపూడి, పోలీసు స్టేషన్ ల పరిధిలో12 ఇళ్ళలో దొంగతనాలు చేసిన కేసులలో నలుగురు నిందితులను జంగారెడ్డిగూడెం పోలీసులు అరెస్ట్ చేసారు. 1, నుడగల శంకర్, (విశాఖపట్నం జిల్లా మధురవాడ) 2, ఉయ్యాల వెంకటరమణ, ( భీమడోలు, పశ్చిమ గోదావరి జిల్లా) 3, యర్రంశెట్టి అనంత (కొయ్యలగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా) 4, వీరవల్లి సింహాద్రి, (పరదేశిపాలెం, విశాఖపట్నం జిల్లా) అను వ్యక్తులు ఒక గ్రూప్ గా ఏర్పడి కారులో తిరుగుతూ జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్బడుతున్నారని పోలీసులు గుర్తించారు. ఈరోజు పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా కొయ్యలగూడెం వైపు నుండి గోపాలపురం వైపు వెళ్తున్న AP 39 EA 2586 నెంబరు గల మారుతీ స్విఫ్ట్ కారును ఆపగా అందులో వున్న ముగ్గురు పురుషులు, ఒక స్త్రీ పారిపోబోతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఇటీవల కాలంలో గోపాలపురం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, తాళ్ళపూడి మండలాలలో జరిగిన ఇంటి దొంగతనాలు తామే చేసామని ఒప్పుకున్నారు. నిందితులు ప్రయాణిస్తున్న కారు ను సోదా చేయగా నిందితులు దొంగిలించిన వెండి, బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద నుండి 13 లక్షల 28 వేల విలువ చేసే 33.5 కాసులు (265 గ్రాములు) బంగారు ఆభరణాలు, 3 లక్షల 86 వేల విలువ చేసే 5 కేజీల 524 గ్రాముల వెండి వస్తువులు, 1,47,000/- రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 18 లక్షల 62 వేల రూపాయల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ప్రయాణించిన స్విఫ్ట్ కారు ను సీజ్ చేసి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తున్నామని జంగారెడ్డిగూడెం డి.ఎస్.పి. రవికిరణ్ తెలిపారు.