పాతికేళ్ళు పూర్తి చేసుకున్న సచిన్

సచిన్ తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం మొదలు పెట్టి ఈరోజుతో 29 ఏళ్లు పూర్తయ్యాయి. 1989 నవంబర్ 15న పాకిస్థాన్‌పై తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన మాస్టర్ బ్లాస్టర్.. 2013లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు సచిన్. ఏటా ఈరోజు తనకు భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తొలి రోజునాటి ఎన్నో జ్ఞాపకాలను గుర్తుచేస్తుంటుందని ట్వీట్ చేశాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం.. 24 ఏళ్లు కెరీర్ కొనసాగడం తనకు లభించిన గౌరవమని పేర్కొన్నాడు.ఎన్నో రికార్డులను తిరగరాసిన ఈ క్రికెట్ యోధుడు తన తొలి ఇన్నింగ్సుతోనే క్రీడాభిమానుల హృదయాలను గెలచుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్, వసీమ్ అక్రం లాంటి పాక్ సూపర్ ఫాస్ట్ బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొని క్రీజులో నిలబడ్డాడు. తొలి ఇన్నింగ్సులో చేసింది 15 పరుగులే అయినా.. వికెట్లు పడకుండా ఆపగలిగాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ దూకుడుగా ఆడి తొలి ఇన్నింగ్సులో 409 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 262 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ … 453 పరుగులను భారత్‌కు టార్గెట్‌గా నిర్దేశించింది. రెండో ఇన్నింగ్సులో సిద్ధూ(155), సంజయ్ మంజ్రేకర్(113) విజృంభించడంతో 3 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది టీమిండియా. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com