కార్తీక మాసంలో పంచారామాల పర్యటన-ఆధ్యాత్మిక వార్తలు

*గుంటూరు జిల్లా అమరావతి
(అమరేశ్వరుడు), తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కుమార రామ భీమేశ్వరుడు), పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు (క్షీర రామలింగేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు)లలో ఉన్న శివాలయాలను ‘పంచారామాలు’ అంటారు. పవిత్ర కార్తిక మాసంలో వాటి సందర్శన కోసం ఎపిఎస్ఆర్టీసీ, తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (టిఎస్టిడిసి) ప్యాకేజీలు ప్రకటించాయి.
*విజయవాడ నుంచి…
ఒకే రోజులో పంచారామాలను సందర్శించే అవకాశాన్ని ఎపిఎస్ ఆర్టీసీ (కృష్ణా రీజియన్) కల్పిస్తోంది. ప్రతి ఆది, సోమవారాలతో పాటు ముఖ్యమైన రోజులలో కూడా ఈ ప్యాకేజీ ఉంటుంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్, ఆటో నగర్ టెర్మినల్ నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇవి అందుబాటులో ఉంటాయి. ముందస్తుగానూ, ఆన్లైన్లోనూ టిక్కెట్లు *రిజర్వ్ చేసుకోవచ్చు.
ఎప్పుడు?: ఈ నెల 17, 18, 19, 24, 25, 26, డిసెంబర్ 1, 2, 3 తేదీలలో
ఛార్జీలు: సూపర్ లగ్జరీలో పెద్దలకు రూ. 850, పిల్లలకు రూ. 660, అలా్ట్ర డీలక్స్లో పెద్దలకు రూ. 840, పిల్లలకు రూ. 630
మరిన్ని వివరాలకోసం: ఫోన్ నెంబర్ 99592 25475లో సంప్రతించవచ్చు.
*హైదరాబాద్ నుంచి…
టిఎస్టిడిసి కూడా ఆంధ్రప్రదేశ్లోని పంచారామాల సందర్శన కోసం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలను అందిస్తోంది.
టూర్ వివరాలు: ఈ మూడు రోజుల యాత్ర ప్రతి శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్లో మొదలవుతుంది, మూడవ రోజు ఉదయం 7 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది.
ఛార్జీలు: పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ. 2,800
*మరిన్ని వివరాల కోసం:
సిఆర్ఓ హైదరాబాద్ 9848540371, ఐఆర్ఓ యాత్రి నివాస్ 9848473568, ఐఆర్ఓ కూకట్పల్లి 9848540374, ఐఆర్ఓ దిల్సుఖ్నగర్ 9848007020, ఐఆర్ఓ పర్యాటకభవన్ 9848306434 లేదా టోల్ఫ్రీ నెంబర్ 180042546464లో సంప్రతించవచ్చు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టిఎస్టిడిసి.ఇన్ వెబ్సైట్లో టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు.
1.శబరిమల కేసు తీర్పుపై స్టే జారీకి సుప్రీంకోర్టు మళ్లీ తిరస్కృతి!
శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశానుమతిని కల్పిస్తూ లోగడ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బుధవారం కూడా నిరాకరించింది. తీర్పు అమలుపై నిలుపుదల ఉత్తర్వులు జారీ చేయాలంటూ దాఖలైన మరో అభ్యర్థనను తిరస్కరించింది. తీర్పు పునఃసమీక్షకు దాఖలైన పిటిషన్లపై జనవరి 22 న రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింటుందని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయి సారథ్యంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
2. పురుషోత్తమునికి.. పుష్పయాగం
తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం బుధవారం అతి వైభవంగా జరిగింది. కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తితిదే పుష్పయాగాన్ని నిర్వహించింది. ఉత్సవమూర్తులను పట్టువస్త్రాభరణాలతో అలంకరించి స్వర్ణపీఠంపై ఆసీనులను చేశారు. తర్వాత శ్రీనివాసునికి విశేష రీతిలో పుష్పయాగం ప్రారంభమైంది. ఉత్సవమూర్తుల పాదాల నుంచి హృదయం వరకు పూలతో మునిగే వరకూ నివేదన జరిగింది. తొమ్మిది టన్నుల బరువైన 14 రకాల కుసుమాలతో, ఆరు రకాల పత్రాలతో ఈ వేడుకను పూర్తిచేశారు. ఈ పూలన్నీ దేశ, విదేశాల నుంచి దాతలు వితరణగా అందించినవే కావడం విశేషం.
3. 125 అడుగుల‌ ఎత్తున్న కావేరీ మాత విగ్ర‌హం
క‌ర్నాట‌క ప్ర‌భుత్వం కావేరీ న‌దిపై 125 అడుగుల ఎత్తు ఉండే కావేరీ మాత విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్న‌ది. దీని కోసం ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తున్న‌ది. మాండ్యా జిల్లాలోని కృష్‌ణ రాజ సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ స‌మీపంలో ఈ విగ్ర‌హాన్ని నిర్మించ‌నున్నారు. ఇక్క‌డే ఓ మ్యూజియం కాంప్లెక్స్‌ను, రెండు గ్లాస్ ట‌వ‌ర్ల‌ను నిర్మించ‌నున్నారు. సుమారు 1200 కోట్ల‌తో ఈ ప్రాజెక్టును చేపట్ట‌నున్నారు. దీని కోసం ఇవాళ ఆ రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి డీకే శివ‌కుమార్‌, ప‌ర్యాట‌క శాఖ మంత్రి సారా మ‌హేశ్ అధికారుల‌తో భేటీ అయ్యారు. రిజర్వాయ‌ర్ ప‌క్క‌నే నిర్మించే కొత్త స‌రస్సులో కావేరి మాత విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు మంత్రి శివ‌కుమార్ తెలిపారు. ఓ ట‌వ‌ర్ త‌ర‌హాలో కావేరి మాత విగ్ర‌హాన్నినిర్మించ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 400 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని వాడ‌నున్నారు. అయితే విగ్ర‌హాల కోసం ప్ర‌భుత్వ నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌డం లేద‌ని, విరాళాలు ఆహ్వానిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com