Food

కూరగాయల పిండి

కూరగాయల పిండి

గోధుమ, బియ్యం, జొన్న పిండి.. ఇలా వేర్వేరు ధాన్యాల పిండితో రకరకాల ఆహార పదార్థాలను చేయడం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు చాలా మంది కూరగాయలను పిండి చేయడమే కాదు.. వీటితో రకరకాల టేస్టీ ఫుడ్స్ కూడా తయారు చేసుకుంటున్నారు. కూరగాయల పిండి కేవలం రుచికరం మాత్రమే కాదండోయ్.. ఆరోగ్యకరం కూడా అని చెబుతున్నారు ఆహార నిపుణులు.
**తాజా కూరగాయాలను కొని ఎండబెట్టిన తర్వాత వాటిని గ్రైండ్ చేస్తే కూరగాయల పిండి వచ్చేస్తుంది. రుచితో పాటు పోషకాల కోసం చూసే వారికి ఇవి చక్కటి ఆహారాలుగా చెప్పవచ్చు. కూరగాయలలోని విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలతో పాటు సూక్ష్మపోషకాలు కూడా ఈ పిండి ద్వారా మన శరీరానికి అందుతాయి. అంతేకాదు ఇవి తయారు చేసేందుకు ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. మరి ఆ కూరగాయలేంటి.. వాటి పిండితో లాభాలేంటి చూద్దాం.
1. బీట్ రూట్ పిండి
బీట్ రూట్ ఆరోగ్యానికి చాలా మంచిదని తెలిసినప్పటికీ చాలా మంది దీన్ని నేరుగా తినేందుకు ఇష్టపడరు. అలాంటి వారికి బీట్ రూట్ పిండి బాగా ఉపయోగపడుతుంది. బీట్ రూట్ పిండిలో ప్రొటీన్లు, విటమిన్-బి6, ఫొలేట్, పొటాషియం లాంటి చాలా రకాల న్యూట్రియన్లు ఉంటాయి. క‌నుక డైట్ లో ఉన్నవారు కూడా వీటితో చేసిన ఆహార పదార్థాలను తినొచ్చు. ఇది శరీరంలో బీపీని కంట్రోల్ చేయడం, బ్రెయిన్ పవర్ ను పెంచడం, శారీరక చురుకుదనాన్ని మెరుగుపరచడం, నొప్పి, మంట లాంటి బాధల నుంచి ఉపశమనం కలిగించడం లాంటి ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాదు కాలేయ ఆరోగ్యానికి కాపాడటమే కాక బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
2. పనసపండు పిండి
పనసపండులో సహజంగానే మన ఆహారానికి న్యూట్రియన్లను అందించే శక్తి ఉంటుంది. భారతదేశంలో ఎక్కువ మంది పనసపండుతో పచ్చడి చేసుకుంటుంటారు. వీటిని ఎండబెట్టుకుని కూడా తింటుంటారు. అలాగే పనసపండు పిండి కూడా చాలా రుచిగా ఉంటుందట. దీన్ని తినలేని వారు పిండి చేసుకుని తినడం వల్ల.. డయాబెటీస్ తగ్గుతుంది, బ్లడ్-షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అలాగే శరీరంలో ఇన్సులిన్ శాతం అదుపులో ఉంటుంది. అంతేకాదు.. ఈ పిండి తినడం వల్ల కార్డియోవాస్కులర్ హెల్త్ బాగుండటంతో పాటు.. కొలొన్ క్యాన్సర్ తగ్గుముఖం పడుతుంది.
3. బ్రోకలి పిండి
బ్రోకలి పిండి మీ ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లోని అధిక న్యూట్రియన్లు, యాంటీ-ఆక్సిడెంట్లు యుముకలకు కాల్షియం అందించేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా బ్రోకలి పిండి తినడం వల్ల చర్మం, జుట్లు ఆరోగ్యం కూడా మెరుగువుతుంది. బ్రోకలి ఆకలిని పెంచడమే కాక, మంచి అరుగుదలకు తోడ్పడి గుండె ఆరోగ్యాన్ని పెంచి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
4. క్యారెట్ పిండి
క్యారెట్లు అధిక న్యూటియన్లతో పాటు ఫైబర్ కలిగిన ఆహారం అని మనకు తెలిసిందే కదా. అలాగే .. క్యారెట్ పిండి కూడా విటమిన్-ఎ, బి లతో పాటు ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి రకరకాల మినరల్లు కలిగి ఉంటుంది. ఇది తినడం వల్ల కంటి చూపు మెరుగవడం, రోగనిరోధక శక్తి పెరగడం, రక్త ప్రసరణ బాగా జరగడం, ఆక్సికరణ బాగుండటం లాంటి ప్రయోజనాలు కలుగుతాయి.