భారత రైల్వే ప్రయాణీకుల చేతివాటం

రైళ్లలోని ఎయిర్‌ కండీషన్ కోచ్‌ల నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.14 కోట్ల విలువ చేసే బెడ్‌షీట్లు, దుప్పట్లు, దిండ్లు, దిండ్ల కవర్ల వంటి వాటిని ప్రయాణికులు చోరీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు ఆ కోచ్‌లలో నిద్రపోవడానికి వీటిని రైల్వే శాఖ అందిస్తుంది. అయితే, వాటిని ప్రయాణికులే చోరీ చేస్తున్నట్లు సంబంధిత అధికారులు అనుమానిస్తున్నారు. ఏడాదిలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్ల పరిధిలో మొత్తం 12,83,415 టవల్స్‌, 4,71,077 బెడ్‌షీట్లు, 3,14,952 దిండ్ల కవర్లు, 56,287 దిండ్లు, 46,515 దుప్పట్లను చోరీ చేశారు. మొత్తం కలిపి 21,72,246 వస్తువులు చోరీ అయ్యాయని వారు తెలిపారు. వీటి చోరీల సమస్య రైల్వే అధికారులకు పెద్ద సమస్యగా మారుతోంది. రెండు బెడ్‌ షీట్లు, ఒక టవల్‌, దిండు, దుప్పటితో ఉండే లైనెన్‌ సెట్‌ను.. ఏసీ కోచ్‌లో ప్రయాణించే ఒక్కో ప్రయాణికుడికి ఒక్కో సెట్‌ చొప్పున అందిస్తామని తెలిపారు. ప్రతి రోజు మొత్తం 3.9 లక్షల సెట్ల లైనెన్‌లను దేశ వ్యాప్తంగా రైళ్లలోని ప్రయాణికులకు అందిస్తామని అధికారులు తెలిపారు. అన్నింటికన్నా టవల్స్‌ అధికంగా చోరీకి గురవుతున్నాయని, ఆ తరువాత బెడ్‌సీట్లను అధికంగా చోరీ చేస్తున్నారని రైల్వే అధికారులు చెప్పారు. దీంతో తాము ఇకపై ప్రయాణికులకు అతి తక్కువ ధరకు వచ్చే, ఒక్కసారి ఉపయోగించి, పారవేసే టవల్స్‌ను అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దేశంలోని 16 రైల్వే జోన్లలో అన్నింటి కంటే దక్షిణ జోన్‌లో అత్యధికంగా 2,04,113 టవల్స్‌, 29,573 బెడ్‌షీట్లు, 44,868 దిండ్ల కవర్లు, 3,713 దిండ్లు 2,745 దుప్పట్లు చోరీ గురయ్యాయి. దక్షిణ మధ్య జోన్‌లో 95,700 టవల్స్‌, 29,747 దిండ్ల కవర్లు, 22,323 బెడ్‌షీట్లు, 3,352 దుప్పట్లు, 2,463 దిండ్లను చోరీ చేశారు. ఉత్తర రైల్వే జోన్‌లో 85,327 టవల్స్‌, 38,916 బెడ్‌షీట్లు, 25,313 దిండ్ల కవర్లు, 3,224 దిండ్లు 2,483 దుప్పట్లు చోరీకి గురికాగా తూర్పు మధ్య జోన్‌లో 33,234 బెడ్‌షీట్లు, 22,769 దిండ్ల కవర్లు, 1,657 దిండ్లు, 76,852 టవల్స్‌, 3,132 దుప్పట్లు చోరీకి గురయ్యాయి. ఇక తూర్పు జోన్‌లో 1,31,313 టవల్స్‌, 20,258 బెడ్‌షీట్లు, 9,006 దిండ్ల కవర్లు, 1,517 దిండ్లు 1,913 దుప్పట్టు చోరీకి గురి కాగా, తూర్పు తీర రైల్వే జోన్‌లో 43,318 టవల్స్‌, 23,197 బెడ్‌సీట్లు, 8,060 దిండ్ల కవర్లు, 2,260 దుప్పట్లను చోరీ చేశారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com