చలికాలం చుండ్రు నివారణకు కమలా పండు

చలికాలం సంత్రాలు (కమలాఫలాలు) ఎక్కువగా వస్తాయి. చలికాలంలో మాటిమాటికీ తడారిపోయే నాలుక దాహార్తిని ఈ పండు తీరుస్తుంది. అంతేకాదు శరీరానికి ఇది ‘ఆరోగ్య మంత్ర’. అదెలాగంటే… కమలాపండులో సి-విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధకశక్తిని ఇది బలోపేతం చేస్తుంది. చర్మం దెబ్బతినకుండా కాపాడుతుంది. రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బ్లడ్‌ షుగర్‌ ప్రమాణాలను నియంత్రిస్తుంది. శరీరాన్ని హైడ్రేట్‌ చేస్తుంది. ఇందులోని విటమిన్‌-ఎ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని పీచుపదార్థం, పొటాషియం, విటమిన్‌-సిలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా మహిళల్లో స్ర్టోక్‌ రిస్కును తగ్గిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో బ్లడ్‌ షుగర్‌ ప్రమాణాలతో పాటుగా లిపిడ్స్‌, ఇన్సులిన్‌ ప్రమాణాలు ఆరోగ్యకరంగా ఉండేలా సహకరిస్తుంది. ముఖంపై ముడతలు పడకుండా చూస్తుంది. స్కిన్‌ టెక్స్చెర్‌ను పరిరక్షిస్తుంది. ఆరెంజ్‌ జ్యూస్‌ తాగితే కిడ్నీ వ్యాధుల బారి నుంచి తప్పించు కోవచ్చు. వైరల్‌ ఇన్ఫెక్షన్లపై ఈ పండు బాగా పనిచేస్తుంది. ఆర్రైటీస్‌ వ్యాధిగ్రస్థులకు కండరాల నొప్పుల నుంచి సాంత్వననిస్తుంది. ఈ పండులోని ఫోలిక్‌ యాసిడ్‌ బ్రెయిన్‌ డెవలె్‌పమెంట్‌కు సహకరిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎముకలు, దంతాల ఆరోగ్యానికి కూడా ఈ పండు మంచిది. అల్సర్లు రాకుండా కాపాడుతుంది. ఇందులో పీచుపదార్థాలు చాలా ఎక్కువ . నోటి దుర్వాసనను నివారిస్తుంది. చర్మంపై నల్లమచ్చలను నివారిస్తుంది. యాక్నే మీద కూడా బాగా పనిచేస్తుంది. చర్మాన్ని కాంతివంతం చేసే సుగుణాలు ఈ పండులో ఉన్నాయి. చర్మానికి మంచి టోనర్‌ కూడా.కమలాపండు రసం జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. శిరోజాల పెరుగుదలకు సహకరిస్తుంది. చుండ్రును నివారిస్తుంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com