కోస్తాలో పెళ్లిళ్లు అవ్వక అబ్బాయిల అగచాట్లు

నువ్వు పెళ్లి చూపులకు వెళ్తున్నావా. వెళ్ళేది నీకు నచ్చడానికి కాదు. నువ్వు ఆ అమ్మాయికి నచ్చావో లేదో తెలుసుకోవడానికి ఇదీ ఇటీవల విడుదలైన ఓ సినిమాలో హీరోను ఉద్దేసించి తండ్రి చెప్పిన డైలాగు. వినడానికి కాస్త కామెడీగా ఉన్నా వాస్తవంగా ఇప్పుడు జరుగుతుంది అదే.

*పెళ్లి చూపులంటే ఒకప్పుడు అమ్మాయికి, ఆమె కుటుంబం సభ్యులకు టెన్షన్. అబ్బాయి తరపున వాళ్ళు ఎం వంకలు పెడతారో .. అవునంటారో.. కాదంటారో .. కాదంటే ఎక్కువ సంబందాలు చేదిపోతున్నయనే పేరుతొ పరువు పోతుందేమో అని.. దశాబ్దం కలం నుంచి సీన్ రివర్స్ అయింది. ఈ టెన్షన్ ఇప్పుడు అబ్బాయిలకు పట్టుకుంది. మారిన అమ్మాయిల మన స్పర్ధలు ఆర్ధిక పరిస్థితులు అమ్మాయిల సంఖ్యా తగ్గడం వంటివి కారణాలు.
*ఒకప్పుడు ఆడపిల్లల తండ్రిని అంతా అదో జాలి చూపు చూసేవారు. ఆడపిల్లల పెళ్లి భారం అనుకోవడమే ఇందుకు కారణం ఇప్పుడు మగ పిల్లల పరిస్థితి అలానే ఉంది. ఒక రకంగా చెప్పాలంటే అంత కంటే హీనమైన పరిస్థితి కారణం సమాజంలో ఆడపిల్లల తండ్రి మా అమ్మాయిని ఇస్తామని ఎవరినైనా అడగొచ్చు. సంబందాలు కోరవచ్చు కనీ మగపిల్లవాడి తండ్రి మా అబ్బాయిని చేసుకుంటారా అని అడగటానికి నామోషి.
*కారణాలేవైనా రెండు దశాబ్దాలు క్రితం అభివృద్ధి చెందిన వర్గాల ఒకరిద్దరు పిల్లలతో సరి పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆడపిల్ల సంఖ్యా గణనీయంగా తగ్గింది. ఇదే క్రమంలో తొంబై శాతం మంది ఆడపిల్లలు విద్యాభ్యాసం పూర్తీ చేశారు. సాఫ్ట్ వేర్ బూమ్ రావడంతో ఎక్కువ మంది ఉద్యోగాల్లో స్థిరపడారు. దీంతో సహజంగానే తమ కంటే మెరుగైన స్తితిలో ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని ఉన్నారు.
**దీంతో పాటు కొన్ని కండీషనులు కూడా పెడుతున్నారు. పల్లెటూరికి రాము. అత్తమామలు రాకూడదు ..ఆడపడచు ఉన్నా ఫోన్లకే పరిమితం కావాలి.. డబ్బులు మా అమ్మా నాన్నకు కూడా పంపాలి. నువ్వు ఎంత సంపదిస్తున్నవో నేను అంత సంపాదిస్తున్నా నా సంపాదన నా ఇష్టం. .దీనికి ఒప్పుకుంటేనే పెళ్లి అంటూ అబ్బాయిల ముందు తమ డిమాండ్లు ఉంచుతున్నారు. దీంతో అర్ధంకాక అబ్బాయిలు తలలు గోక్కుంటున్నారు.

****ఉద్యోగం లేకపోతె బ్రహ్మచారి బతుకే.
ఒకప్పుడు ముందుగా అబ్బాయికి ఎంత స్థిరాస్తి ఉంది? అతని వాటాకు ఎంత వస్తుంది? అప్పులు ఎన్ని ఉన్నాయి? అని విచారిమ్చుకుని వివాహ సంబందానికి ప్రయాణం అయ్యేవారు ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముందు ఉద్యోగం ఎక్కడ.. అది ప్రభుత్వమా. మల్టీ నేచనల్ కమపనీయా. మామూలు కంపనీయా ప్యాకేజీ ఎంత పే స్లిప్ చూపించాడా? ఇవన్నీ చూసుకుని బయల్దేరుతున్నారు. అది కాక ఏ వ్యవసాయ కుటుంబంమో, వ్యాపారమో, లేదా ఏదైనా కుల వృత్తో చేసుకుంటూ ఉంటె మాత్రం బ్రహ్మచారిగా ముదిరిపోవడమే.

**ఈ వృత్తులలో వారికి పిల్లను ఎచ్చేద్నుకు తల్లిదండ్రులు చేసుకునేందుకు ఆడపిల్లలు కూడా అంగీకరించడంలేదు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉండాల్సి వస్తుందని, అత్తమామల వండి పెట్టాల్సి వస్తుందని, అంతపని మా అమ్మాయి చేయలేదని ముందే చెబుతున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఇతర వృతుల పై ఆధారపడి జీవిస్తున యువకులకు పిల్లను ఇచ్చే నాధుడే లేక ఎవరికీ చెప్పుకోవాలో ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినా ఇప్పటికీ ఒక్కో గ్రామంలో వందల సంఖ్యలో పెళ్ళిళ్ళు కాకుండానే ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తూనే ఉన్నారు.

***పెరుగుతున్న అంచనాలు
ప్రకాశం జిల్లా సంతమడుగుల మండలంలో ఇటీవల ఓ సంఘటన జరిగింది. ఈ గ్రామంలో అగ్రకులానికి చెందిన సుమారు నలభై మంది ఆడపిల్లు ఉన్నారు. గుంటూరుకు చెందిన ఓ వ్యాపారి సంబందాలు దొరక్క వారిలో ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి ఖర్చులు కూడా తానె భరించి వివాహం చేసుకున్నాడు. దీంతో ఆ గ్రామంలో మిగిలిన తల్లిదండ్రులు అంచనాలు పెరిగి పోయాయి. ఏమీ లేని ఇవ్వలేని ఆ అమ్మాయికే కోట్ల ఆస్తిపరుడు ఉన్న సంబంధం చేసుకుంటే మేం ఎకరం పొలం ఇస్తున్నాం. మాకు అంతకు మించిన సంబంధం వస్తుందంటూ కూర్చున్నారు. ఏడాది కాలంలో ఆ గ్రామంలో ఒక్క అమ్మాయికి కూడా పెళ్లి కాలేదు. కేవలం కోర్కెలు పెంచుకుని కూర్చోవడమే కారణంగా భావిస్తున్నారు. ఈ నలభై మందిలో ఒక్కరు కూడా ఉన్నత విద్యనూ అభ్యసించిన వారు కూడా అయినా మెట్టు దిగడం లేదు.

**పెళ్లి కోసమే ఉద్యోగం .
దీనిని గమనించిన మగాపిల్లల తల్లిదండ్రులు ఎం తక్కువ తినలేదు. ఎంత కాహ్దివినా ఎం చదివినా. పిల్లలను పట్టణాల్లోనే ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరులో ఉంచుతూ ఎదో ఒక ఉద్యోగం చేస్తున్నారు. అని చెబుతూ వివాహం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతరం ఉద్యోగం లేదని, బాగాలేదని గ్రామానికి తీసుకొస్తున్నారు. ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతుండడంతో ఆడపిల్లల తల్లిదండురులు కూడా ఉద్యోగం చేసే ప్రదేశానికి వెళ్లి పూర్తిగా విచారించుకుని వివాహ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు.

**శ్రీకాకుళం బాట
ఆడపిల్లల దొరక్క మగపిల్లలను ఎక్కువ కాలం పెళ్లి లేకుండా చూడలేక అస్తిపరులైన తల్లిదండ్రులు రెండేళ్లుగా శ్రీకాకుళం బాట పట్టారు. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో వెనుకబడిన తరగతుల వారికీ చెందిన పిల్లలను రంగు రూపం ఉంటే ఎదురు డబ్బులు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఈ సంఖ్య కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గణనీయంగా ఉంది. కేవలం ఆస్తి ఉండడం ఆర్ధికంగా ఇబ్బందులు లేకపోవడంతో ఆ ప్రాంతంలో సాధారణ జీవితం గడిపే తల్లిదండ్రులు తమ కుమార్తె తమ కన్నా మెరుగైన జీవితం గడుపుతుందన్న ఉద్దేశంతో వివాహాలకు మొగ్గు చూపుతున్నారు. దీని కోసమై గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన పెళ్ళిళ్ళ బ్రోకర్లు ఆయా ప్రాంతాల్లో ప్రత్యెక బ్రాంచ్ లను కూడా ఏర్పాటు చేసి పిల్లల తల్లిదండ్రులు ఎక్కువగా రాకూడదన్న కండీషన్ పెడుతున్నారు. కనీ పెళ్లి అయిన తరువాత ఎక్కువమంది సజావుగానే కాపురాలు చేసుకుంటున్నారు. దీంతో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాల్లో పిల్లలు అయితే అత్తమామల వద్ద గౌరవంగా ఉంటున్నారన్న భావన నెలకొనడంతో ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com