ఆయన రాడు. రాలేడు. కావాలంటే వీడియో తీసుకోండి.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు(పీఎన్‌బీ) రూ.13వేల కోట్ల కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్న మెహుల్‌ ఛోక్సీ భారత్‌ రాలేరని ఆయన తరఫు న్యాయవాది ముంబయిలోని ప్రత్యేక న్యాయస్థానానికి తెలియజేశారు. ఛోక్సీకి పారిపోయిన ఆర్థిక నేరగాడి ట్యాగ్‌ ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ముంబయి పీఎంఎల్‌ఏ కోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ విచారణ సందర్భంగా ఛోక్సీ తరఫు న్యాయవాది కోర్టుకు హాజరయ్యారు. ‘ప్రస్తుతం ప్రయాణాలు చేసేందుకు ఛోక్సీ ఆరోగ్యం ఏమాత్రం బాగోలేదు. ఒకవేళ ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయాలనుకుంటే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేసే అవకాశం కల్పించండి. లేదంటే ఈడీ అధికారులు ఆంటిగ్వా వెళ్లి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకోవచ్చు. కాదంటే ఆయన ఆరోగ్యం కుదుటపడేంత వరకు ఓ మూడు నెలల పాటు వేచి ఉండండి. ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత వెనక్కి వస్తారు’ అని ఛోక్సీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న ఛోక్సీని భారత్‌ రప్పించేందుకు అధికారులు ఆదేశ అధికారులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. చట్టపరంగా అన్ని పూర్తి చేసిన తర్వాత వీలైనంత త్వరగా ఛోక్సీని భారత్‌ పంపించేందుకు ప్రయత్నిస్తామని ఆంటిగ్వా ప్రభుత్వం భారత్‌కు హామీ ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నీరవ్‌ మోదీని కూడా భారత్‌ రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com