దిగిపోవాలి…దిగిపోవాలి. జుకర్‌బర్గ్ దిగిపోవాలి.

ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్ ఫేస్‌బుక్‌ ఛైర్మన్‌, సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌పై పెట్టుబడిదారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. ఆయన రాజీనామా చేయాలని ఇన్వెస్టర్లు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్ రిపబ్లికన్‌ పార్టీకి చెందిన పొలిటికల్‌ కన్సల్టింగ్‌ సంస్థ, పబ్లిక్‌ అఫైర్స్‌ సంస్థతో ఒప్పందం కుదర్చుకున్నట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించిన నేపథ్యంలో జుకర్‌బర్గ్‌పై ఒత్తిడి పెరిగినట్లు గార్డియన్‌ అనే పత్రిక శనివారం తన కథనంలో పేర్కొంది. ఫేస్‌బుక్‌ పోటీదారులు, విమర్శకుల వ్యాఖ్యలు, ప్రకటనలకు ప్రాధాన్యం తగ్గించేలా పనిచేస్తాయని తెలిపింది. ఫేస్‌బుక్‌లో వాటా ఉన్న ట్రిల్లియం అసెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జొనాస్‌ క్రాన్‌ జుకర్‌బర్గ్‌ను బోర్డ్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్‌ చేసినట్లు సమాచారం. అయితే పొలిటికల్‌ కన్సల్టింగ్‌ సంస్థ గురించి అసలు తనకు తెలియదని మార్క్‌ జుకర్‌బర్గ్‌ వెల్లడించారు. పత్రికలో కథనం చూసి తమ సిబ్బందితో కూడా మాట్లాడానని, ఆ సంస్థతో తామె ఎప్పుడూ కలిసి పనిచేయలేదని ఆయన తెలిపారు. ఫేస్‌బుక్‌ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్‌ కూడా సదరు పొలిటికల్‌ కన్సల్టింగ్‌ సంస్థ గురించి మాకు తెలియదని వెల్లడించారు. తమ కంపెనీపై వ్యతిరేక ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదని ఫేస్‌బుక్‌ పేర్కొంది. 2016 అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం ఉందని ఫేస్‌బుక్‌కు ముందే తెలుసు అన్న ఆరోపణలను కూడా ఆ సంస్థ ఖండించింది. గార్డియన్‌ కథనం నేపథ్యంలో శుక్రవారం ఫేస్‌బుక్‌ షేర్లు 3శాతం పడిపోయాయి. షేరు విలువ 139.53డాలర్లకు పడిపోవడంతో 2017 ఏప్రిల్‌ తర్వాత కనిష్ఠ స్థాయికి చేరాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com