కుటుంబాలు విడిపోతాయి…

అమెరికాలో హెచ్‌-1బీ వీసాదారుల జీవితభాగస్వామికి ఇచ్చే హెచ్‌-4వీసాను కాపాడాలని ఇద్దరు శాసనసభ్యులు అమెరికా కాంగ్రెస్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. హెచ్‌-4వీసాతో జీవిత భాగస్వాములకు లభిస్తున్న పని అనుమతిని తొలగించాలని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సదుపాయం తీసేయడం వల్ల ఎంతో మంది ప్రతిభావంతులు దేశం విడిచి వెళ్లే అవకాశముందని, లేదంటే కుటుంబాలు విడిపోయే ప్రమాదముందని.. అలా జరిగితే వారి తెలివితేటలను అమెరికాకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారని బిల్లులో పేర్కొన్నారు. హెచ్‌-1బీ వీసా ద్వారా విదేశీయులు అమెరికాలో పనిచేయొచ్చు. వారి జీవిత భాగస్వాములకు హెచ్‌-4 వీసా ద్వారా పని అనుమతి లభిస్తుంది. హెచ్‌-4 వీసాను రద్దు చేస్తే ఆ ప్రభావం చాలా మంది వలసదారులపై పడుతుందని, దాన్ని రద్దు చెయ్యొద్దని కోరుతూ శాసనకర్తలు అన్నా జీ ఎషో, జోయ్‌ లాఫ్‌గ్రెన్‌లు కాంగ్రెస్‌లో ‘హెచ్‌-4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్‌ యాక్ట్‌’ బిల్లును ప్రవేశపెట్టారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com