జనగామ నాదే

జనగామలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తాను నామినేషన్‌ వేస్తున్నానని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు. 35ఏళ్లుగా తాను జనగామ నుంచి పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. జనగామలో ఎనిమిదోసారి నామినేషన్‌ వేస్తున్నట్లు ఆయన చెప్పారు. తనను ఆదరించిన జనగామ ప్రజలకు కృతజ్ఞతలని పేర్కొన్నారు. తన శేషజీవితం జనగామ ప్రజలు, నియోజకవర్గంతో ముడిపడి ఉందన్నారు. గతంలో తానే 119 మంది అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కూటమిలో పొత్తుల వ్యవహారం వల్ల ఆలస్యమైందన్నారు. కూటమి పొత్తుల్లో భాగంగా తొలుత జనగామను తెజసకు కేటాయించారు. ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం బరిలోకి దిగేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ మొదటి, రెండో జాబితాలో పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాలకు చోటు దక్కలేదు. అప్రమత్తమైన పొన్నాల వెంటనే దిల్లీ చేరుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని కలిసి తాను పోటీ చేయకుంటే సామాజిక వర్గాల్లో కలిగే ప్రతికూలతలను వివరించారు. స్పందించిన రాహుల్‌ పొత్తులో సీటు కేటాయించినందున కోదండరాంతో మాట్లాడుకోవాలని సూచించారు. ఆయన కోదండరాంతో భేటీ అయ్యి తన సీటు తనకే ఉండేలా చూసుకోవడంలో సఫలీకృతులయ్యారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com