సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో భాగంగా ముంబయితో తలపడిన మ్యాచ్‌లో కేరళ బ్యాట్స్‌మన్ మహ్మద్ అజహరుద్దీన్(137*; 54 బంతుల్లో 9×4, 11×6) విధ్వంసక శతకం బాదాడు. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం 37 బంతుల్లోనే శతకం సాధించి భారత్ తరఫున పొట్టి క్రికెట్‌లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. దీంతో అజహరుద్దీన్ బ్యాటింగ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్, డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. అజహరుద్దీన్ అత్యుత్తమ ఆటగాడని కొనియాడాడు. ముంబయి లాంటి గొప్ప జట్టుపై ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం సాధారణ విషయం కాదన్నాడు. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడని మెచ్చుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ చూసి సంతోషించానని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. అనంతరం అజహరుద్దీన్ చెలరేగడంతో కేరళ 2 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఇదిలా ఉండగా, బుధవారమే ఇంకో మ్యాచ్‌లో మేఘాలయ ఆటగాడు పునీత్ బిష్ఠ్(146*; 51 బంతుల్లో 17×6) కూడా విధ్వంసక శతకం సాధించాడు. మిజోరాంతో తలపడిన మ్యాచ్‌లో తొలుత మేఘాలయా 230 పరుగులు చేసింది. అనంతరం మిజోరాం 100 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి భారీ ఓటమి చవి చవిచూసింది.
అజహరుద్దీన్‌కు సెహ్వాగ్ ప్రశంసలు
Related tags :