DailyDose

అవనిగడ్డలో తల్లిదండ్రులే హంతకులు-నేరవార్తలు

అవనిగడ్డలో తల్లిదండ్రులే హంతకులు-నేరవార్తలు

* అవనిగడ్డ….నాడు కొడుకు-నేడు తండ్రి. ఇద్దరూ హత్యలు చేయడానికి ఒకటే కారణం…ఆగస్టు 6, 2019 న చల్లపల్లి లోని బిసి హాస్టల్ లో 3వ తరగతి చదువుతున్న దాసరి ఆదిత్యను అదే హాస్టల్ లో ఉంటూ 10వ తరగతి చదువుతున్న విద్యార్థి చందోలు సందీప్ అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన విషయం మరువకముందే….జనవరి 15, 2021 నిన్న ఘంటసాల మండలం కొడాలి గ్రామంలో కందుల వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని అత్యంత కిరాతకంగా తలపై ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన చందోలు రాజశేఖర్…చందోలు సందీప్ కి చందోలు రాజశేఖర్ తండ్రి…ఇద్దరు హత్యలు చేయడానికి కారణం ఒక్కటే….తన తల్లిని బూతులు తిట్టాడు అనే ఒకే ఒక్క కారణం.నాడు పెన్సిల్ చెక్కే చిన్న బ్లేడ్ తో సందీప్ హత్య చేయగా, నేడు ఇనుప రాడ్డుతో రాజశేఖర్ హత్య చేశాడు

* రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ పట్టణ పరిధిలోని చటాన్ పల్లి (రామ్ నగర్) లో నివసిస్తున్న మేస్త్రి నగేష్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో రాత్రి కుటంబ సభ్యులతో ఘర్షణ పడ్డట్టు స్థానికులు పేర్కొన్నారు. ఉదయం ఉరివేసుకుని చనిపోయినట్టు స్థానికులు పేర్కొంటున్నారు.

* వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం NH పై లారీని ఢీ కొట్టిన మినీ బస్ ఒక మహిళ మృతి ఇద్దరి పరిస్థితి విషమం ఆరుగురికి స్వల్ప గాయాలు ఆస్పత్రికి తరలింపు తిరుపతి నుంచి హైదరాబాద్ కు వెళుతున్న మినీ బస్ ఎల్బీనగర్ కు చెందినవారు.

* మండపేట లో ఆయిల్ ఫ్యాక్టరీ లో అగ్ని ప్రమాదం.అగ్ని ప్రమాదం లో మాధవి ఎడిబుల్ ఆయిల్స్ ఫ్యాక్టరీ.పెద్ద ఎత్తున వ్యాపించిన మంటలు.మంటలను అదుపు చేయలేకపోతున్న అగ్నిమాపక సిబ్బంది.

* మంగళగిరి పట్టణంలోని పలు చేనేత సొసైటీలలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు.ఆయా సొసైటీలలో భారీగా అక్రమాలు జరిగినట్లు వెల్లడి.పలు సొసైటీల ఆస్తులను అమ్ముకున్న నిర్వాహకులు.చేనేత కార్మికుల పేర్లతో కోట్ల రూపాయల సబ్సిడీని దోచుకున్న వివిధ సొసైటీ నిర్వాహకులు.

* కానిస్టేబుల్ వేదింపులు తాళలేక ఆత్మహత్య ప్రయత్నం చేసిన మాజీ ఎస్పిఓ నాగశ్రీను.గత కోంత కాలం క్రితం వరకు నందిగామ నియోజకవర్గ లో పలు సరిహద్దుల చెక్ పోస్టుల వధ్ద స్పెషల్ ఎస్పిఓ విధులు నిర్వహించిన నాగశ్రీను.కానిస్టేబుల్ కిషోర్ కారణంగా తాను ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నట్లు గత అర్ధ ర్రాతి సెల్పి వీడియో తీసుకున్న నాగశ్రీను.గత కోంత కాలంగా కానిస్టేబుల్ కిషోర్, కి నాగ శ్రీను మద్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు, అక్రమ మద్యం వ్యాపారం చేసి అ డబ్బుల విషయంలో అంతర్గత ఘర్షణ జరుతున్నట్టు అనుమానం.నాగ శ్రీను ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలింపు.జగ్గయ్యపేట మం చిల్లకల్లు పోలీస్ స్టేషన్ల్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కిషోర్ సస్పెండ్ అయినట్టు సమాచారం.