DailyDose

జనవరి 17 2021-నేటి వార్తా విశేషాలు

జనవరి 17 2021-నేటి వార్తా విశేషాలు

పుష్య మాసం చవితి ఆదివారం

నేడు ఎన్నికలు కమిషన్ స్థాపక దినోత్సవం

1989 జనవరి 17న మొదటిసారి ఒక భారతీయుడు – కల్నల్ జె.కె.బజాజ్ – దక్షిణ ధృవాన్ని చేరుకున్నాడు

2008 జనవరి 17న టెస్ట్ క్రికెట్‌లో 600 వికెట్లు సాధించిన తొలి భారతీయ బౌలర్‌గా అనిల్ కుంబ్లే రికార్డు సృష్టించాడు

విశ్వ విఖ్యాత బాక్సర్. మూడు సార్లు హెవీవెయిట్ బాక్సింగ్ ప్రపంచ విజేతగా నిలిచిన శక్తిశాలి ముహమ్మద్ ఆలీ(అసలు పేరు క్లాషియస్ క్లే) జయంతి

తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత ఎల్.వి.ప్రసాద్ జయంతి

తెలంగాణ కవి, రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు మడిపల్లి భద్రయ్య జన్మదినం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు స్వంతం చేసుకున్న జ్యోతి బసు వర్ధంతి

చిన్నతనంలోనే అరవై నాలుగు గళ్ళ చదరంగం క్రీడలో అపారమైన ప్రతిభను చూపి, 1972లో ప్రపంచ చదరంగ కిరీటాన్ని గెలిచి ఆ ఘనత సాధించిన తొలి అమెరికన్‌గా రికార్డు సృష్టించిన బాబీ ఫిషర్ వర్ధంతి

భారత దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు,175 మంది మృతి

ప్రపంచ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 3,18,634 మందికి కరోనా పాజిటివ్ కేసులు, 7,080 మంది మృతి

దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ విజయవంతం, తొలి రోజు 1,91,181 మందికి టీకా

కోవిడ్‌ టీకా వేసే కార్యక్రమంలో మోదీ ‘సొంత లాభం కొంత మానుకొని, తోడివాడికి సాయపడవోయ్. దేశమంటే మట్టి కాదు.. దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ అప్పారావు వారి పద్యాన్ని గుర్తు చేశారు మోదీ. తద్వారా దేశ ప్రజలంతా కలిసి ముందుకు సాగాలని సూచించారు.

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతం.. తొలి రోజు 3,530 మందికి టీకా అందించామన్న హెల్త్‌ డైరెక్టర్

తాజాగా జాతీయ స్థాయి న్యూస్ ఛానల్ ఏబీపీ న్యూస్-సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదరణ గల ముఖ్యమంత్రుల జాబితాలో ఫస్ట్ ప్లేసులో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మూడో స్థానంలో సీఎం జగన్ నాలుగవ స్థానంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, అయిదవ స్థానంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఉన్నారు.

తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమంగా మద్యం తరలిస్తున్నవారిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు.

కోవాగ్జిన్ వల్ల ప్రజలు అస్వస్థత పాలైతే పరిహారం, ప్రత్యేక ఆసుపత్రుల్లో చికిత్స, మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం

కేంద్ర మాజీ మంత్రి కమల్ మొరార్కా మృతి, ఆయన మరణం తీరని లోటన్న రాజకీయ ప్రముఖులు

రూమర్లను నమ్మకండి, కోవిడ్ పై పోరాటం ఆరంభమైంది, మానవాళి కోసం ప్రాణాలు అర్పించినవారికిదే నివాళి, మోదీ

వర్షం కారణంగా నాలుగో టెస్ట్‌కి అంతరాయం, నిలిచిపోయిన ఇండియా బ్యాటింగ్

క్రికెటర్ హార్దిక్ పాండ్యా తండ్రి గుండెపోటుతో మృతి, విషాదంలో కుటుంబ సభ్యులు

నార్వేలో ఫైజర్ వ్యాక్సిన్ వికటించి 23 మంది వృధ్ధుల మృతి, మరో 23 మందికి తీవ్ర అస్వస్థత, విచారణకు ప్రభుత్వ ఆదేశం

వ్యాక్సిన్ తీసుకోగానే సరిపోదు, ప్రోటోకాల్స్ ని నిర్లక్ష్యం చేయకండి. ప్రధాని మోదీ, రెండు డోసులూ తీసుకోవాల్సిందే

కరోనా వైరస్ ఈరోజు ప్రపంచ దేశాల్లో వ్యాపించడానికి చైనానే కారణమని తమ వద్ద ఆధారాలున్నాయని అమెరికా దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో సంచలన ఆరోపణలు చేశారు.

సికింద్రాబాద్‌లోని చందు జైన్‌ జ్యూవెల్లరీ దుకాణంలో జరిగిన చోరీని పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిందితుడు గతంలో షాపులో పనిచేసిన డ్రైవర్‌గా గుర్తించారు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల తర్వాత నగరంలో ఓటర్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కొత్తగా 41,189 మంది ఓటర్లు పెరిగారు

వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేయించుకున్న సీరం సీఈఓ.. వ్యాక్సిన్ నాణ్యతకు తానే నిదర్శనమని ప్రకటన

స్టార్టప్ ఇండియా అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.. ‘ప్రారంభ్’​ పేరిట ఈ సదస్సును కేంద్ర వాణిజ్య, పరిశ్రమల ప్రోత్సాహక శాఖ నిర్వహిస్తోంది

మహారాష్ట్ర రాజధాని ముంబై‌లో రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో నడిచే పాఠశాలలు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అన్ని పాఠశాలలు మూసివేస్తున్నామని ముంబై మునిసిపల్ కార్పొరేషన్ తెలిపింది.

భారత్‌లో పెరుగుతున్న స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటున్న కేంద్ర ఆరోగ్యశాఖ

శంషాబాద్‌లో విషాదం.. గేదెల కొట్టానికి నిప్పు పెట్టిన దుండగులు, ఆరు గేదెలు సజీవ దహనం