పాన్ మీద పితాశ్రీ పేరు తప్పనిసరి కాదు

శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) దరఖాస్తులో తండ్రి పేరు తప్పనిసరిగా పేర్కొనాల్సిన నిబంధనను కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) సడలించింది. తల్లి మాత్రమే ఉండేవారికి ఈ సడలింపు వర్తిస్తుంది. అంటే తమను వదిలిపెట్టిన లేదా మరణించిన తండ్రి పేరును వీరు దరఖాస్తులో తప్పనిసరిగా పేర్కొనాల్సిన అవసరంలేదు. ఈ మేరకు నిబంధనలను సవరిస్తూ సీబీడీటీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే నెల 5 నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయని స్పష్టీకరించింది. మరోవైపు ఆర్థిక సంవత్సరంలో రూ.2.5 లక్షలకు మించి లావాదేవీలు జరిపే సంస్థలూ తప్పనిసరిగా పాన్కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. మే 31లో ఈ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందనీ వెల్లడించింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com