చలికాలం పసుపు-చిలగడదుంప మంచివి

చలికాలంలో జలుబు, దగ్గు వంటివి సాధారణం. వాతావరణంలో మార్పులు, చల్లటి గాలులు, సూర్యరశ్మి తక్కువగా ఉండడమే అందుకు కారణం. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే చిన్న చిన్న అనారోగ్యాల బారిన పడకుండా రక్షణ పొందొచ్చు. అవేంటో చూద్దాం..
*పసుపు
రాత్రి పూట నిద్రపోయే ముందు పాలలో, కొద్దిగా పసుపు కలుపుకొని తాగాలి. జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు తగ్గిపోవడమే కాకుండా రోగనిరోధక శక్తి కూడా మెరుగవుతుంది.
*చిలగడదుంప
వీటిలో విటమిన్ ఎ, పీచు పదార్థం, పొటాషియం అధికంగా ఉంటుంది. చిలగడదుంప తింటే కడుపు ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
*ఖర్జూర
వీటిలో కొవ్వు తక్కువ మోతాదులో, పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. చలికాలంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ఖర్జూర నివారిస్తుంది.
*అల్లం
తేనెతో కలిపి అల్లం ముక్కలను గానీ, అల్లం రసం గానీ రోజు తీసుకుంటే దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణశక్తి కూడా మెరుగవుతుంది.
*డ్రై ఫ్రూట్స్
ఎక్కువగా వేయించిన ఆహార పదార్ధాలు, కూరలు జీర్ణాశయం పనితీరుపై ప్రభావితం చూపుతాయి. డ్రై ఫ్రూట్స్ను స్నాక్స్గా, ఆహారంలో భాగం చేసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com