పాకిస్థాన్ పీక మీద కాలేసిన అమెరికా

అమెరికా నుంచి పాకిస్థాన్‌కు అందే 1.3 బిలియన్‌ డాలర్ల భద్రతా పరమైన సహకారాన్ని అగ్ర రాజ్యం నిలిపివేసింది. ట్రంప్‌ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా రక్షణశాఖ అధికార ప్రతినిధి విలేకరులకు ఈ మెయిల్‌ ద్వారా వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాల విషయంలో పాకిస్థాన్‌ వైఖరి మార్చుకోకపోవడంతోనే ఆ దేశానికి భద్రతా సహకారాన్ని నిలువరించి అమెరికా కఠిన నిర్ణయం తీసుకుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అల్‌ఖైదా చీఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌ ఆచూకీ తెలిసినా కూడా పాక్‌ ప్రభుత్వం అమెరికాకు చెప్పలేదని ట్రంప్‌ ఆరోపించిన కొద్ది రోజులకే ఈ పరిణామం జరగడం గమనార్హం. ‘‘ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ఇంతకు ముందు పాక్‌ నేతలు అమెరికాకు చెప్పారు. కేవలం మాటలే కానీ ఆ దిశగా పాకిస్థాన్‌ కఠినమైన చర్యలు తీసుకోలేదు. దీనివల్ల పాక్‌ పొరుగు దేశాలు ఉగ్రవాదం వల్ల నష్టపోతున్నాయి. అందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. భద్రతా సహకారాన్ని నిలిపివేయడం పాక్‌కు గట్టి హెచ్చరిక లాంటిది. తాలిబన్‌, లష్కర్‌ ఏ తోయిబా వంటి ఉగ్ర సంస్థలపై ఒకవేళ పాక్‌ కఠిన చర్యలు తీసుకుంటే అఫ్గానిస్థాన్‌లోనూ శాంతి పరిస్థితులు నెలకొంటాయి. ఇలాగే భారత్‌కు వ్యతిరేకంగా ఉండే ఉగ్ర సంస్థలనూ నిలువరిస్తే ఆ దేశంతో సత్సంబంధాలు ఏర్పడడమే కాకుండా మంచి ఆర్థిక పరమైన ప్రయోజనాలు పాక్‌ పొందవచ్చు.’’ అని గతంలో రక్షణ విభాగంలో పని చేసిన డేవిడ్‌ సెడ్నీ ఓ జాతీయ వార్తా సంస్థతో అన్నారు. ఈయన ఒబామా హాయాంలో పాక్‌, అఫ్గానిస్థాన్‌ రక్షణ విభాగంలో డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీగా పనిచేశారు. హక్కానీ నెట్‌వర్క్‌, తాలిబన్‌ ఉగ్ర సంస్థల కార్యకలాపాలు నిలువరించనందుకు గానూ గత సెప్టెంబరులో పాక్‌కు 300 మిలియన్‌ డాలర్ల మిలిటరీ సాయాన్ని ట్రంప్‌ సర్కారు రద్దు చేసిన సంగతి తెలిసిందే.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com