*ఎక్గిట్ పోల్స్ ఫలితాలు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే రానుందనే సంకేతలివ్వడంతో సెన్సెక్స్ నిప్తీలు సోమవారం దూసుకుపోయాయి. పదేలల్లో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులోనే సెన్సెక్స్ 1421 పాయింట్లు పెరిగి 39,352 పాయింట్లకు చేరింది.
*రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై అమెరికాలో పేటెంట్ ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు, వాహన విడిభాగాల తయారీ సంస్థ ఫ్లాష్ ఎలక్ట్రానిక్స్ ఇండియా (పుణె) ప్రకటించింది. విద్యుత్తు నియంత్రణకు సంబంధించిన రెగ్యులేటర్ రెక్టిఫైయర్ డివైస్ అనే ఎలక్ట్రానిక్ పరికర పనితీరుపై ఈ కేసును దాఖలు చేసినట్లు తెలిసింది. ఆ పరికరాన్ని తమకు వేరే సంస్థ సరఫరా చేసిందని ఎన్ఫీల్డ్ పేర్కొంది.
*ఫోర్డ్లో వచ్చే మూడు నెలల్లో 7,000 ఉద్యోగాలకు కోత పడనుంది. మొత్తం ఉద్యోగుల్లో వీరు 10 శాతానికి సమానం. ఆగస్టు నాటికి వేల సంఖ్యలో ఉద్యోగుల్ని ఇంటికి పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కంపెనీ సోమవారం వెల్లడించింది.
*ఇన్ఫోసిస్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈఓ) సలీల్ పరేఖ్ గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో రూ.24.67 కోట్ల వేతన ప్యాకేజీ అందుకున్నారు.
*చైనీస్ స్మార్ట్ఫోన్ల సంస్థ హువావెకు అమెరికా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారీ షాక్ ఇచ్చింది. హువావెతో ఒప్పందాలన్నీ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.
*హెలీకాప్టర్ సేవలు అందించే ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ విక్రయం విఫలం కావడంతో.. ఈ నెల చివరికి తాజా బిడ్ పత్రం జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొనుగోలుదార్లకు నష్టపరిహారం కింద కంపెనీకి ఉన్న దాదాపు రూ.500 కోట్ల వరకు రుణాలను అందించడానికి సిద్ధమైంది.
*హెలీకాప్టర్ సేవలు అందించే ప్రభుత్వ రంగ సంస్థ పవన్ హన్స్ విక్రయం విఫలం కావడంతో.. ఈ నెల చివరికి తాజా బిడ్ పత్రం జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొనుగోలుదార్లకు నష్టపరిహారం కింద కంపెనీకి ఉన్న దాదాపు రూ.500 కోట్ల వరకు రుణాలను అందించడానికి సిద్ధమైంది.
*గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో హెచ్‌పీసీఎల్ రూ.2,970 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన రూ.1,748 కోట్లతో పోలిస్తే ఇది 70 శాతం అధికం.
*వాహన దిగ్గజం టాటా మోటార్స్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.1,108.66 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో సంస్థ ఆర్జించిన నికర లాభం రూ.2,175.16 కోట్లతో పోలిస్తే ఇది 49 శాతం తక్కువ.
*రోడ్డు మీద తిరిగే ప్రతి వాహనానికీ కచ్చితంగా థర్డ్ పార్టీ బీమా ఉండాల్సిందే. ఈ తప్పనిసరి బీమా ప్రీమియాన్ని పెంచేందుకు భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ప్రతిపాదించింది.
*సుజుకీ మోటార్స్ ఇండియా స్పోర్ట్స్ టూరింగ్ బైకు జిక్సర్ ఎస్ఎఫ్ 250ని విపణిలోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.1.7 లక్షలు (ఎక్స్-షోరూమ్ దిల్లీ)గా నిర్ణయించారు.
*జర్మనీ విలాస కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ బీఎస్-6 నిబంధనలకు లోబడిన సెడాన్ మోడల్ ఇ-క్లాస్‌ను సోమవారం భారత విపణిలోకి విడుదల చేసింది.
సెన్సెక్స్ సంచలనం-వాణిజ్య-05/21
Related tags :